Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-240

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. (Grid 9 x 9).

ఆధారాలు:

అడ్డం:

1) శ్రీరంగములోని రంగనాయక స్వామి వైభవములు, మిక్కిలి వైభవములు (9)
5) లక్ష్మీ, విష్ణువుల కృప, కరుణ (9)
6) ఆడు తాబేలు (2)
7) రథవేగము (3)
8) ఈరి, దానము, వరము, పారితోషికము (2)
11) శత్రుత్వం తడబడింది, మూడవ అక్షరంలో ఒత్తు కోల్పోయింది (3)
12) వెనువెంటనే, అతి తొందరగా, ఇప్పటికిప్పుడు (5)
13) బ్రహ్మ (8)

నిలువు:

1) హోళీ నాడు (9)
2) విష్ణువు, శ్రీరంగంలోని దైవం (4)
3) న్యాయవాది, వకీలు, న్యాయవాద వృత్తి (4)
4) క్రింద నుంచి పైకి – అణకువ అను అర్థమున వాడు జంట పదములు (8)
9) అంగీకారముగా, సమ్మతితో – తడబడింది (4)
10) నింద, దూరు, అసత్యవాదము, అపఖ్యాతి (4)
12) ఊయల, డోల, తొట్ల, (3)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 అక్టోబర్ 13వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 240 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 అక్టోబర్ 18వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 238 జవాబులు:

అడ్డం:   

1) చంద్రునికి ఓ నూలుపోగు 5) మాట్లాడు గాలుసగుసగు 6) కరం 7) ప్రతిష్ఠ 8) పుగుం 11) న్నెవలు 12) తలపొలము13) దాయాదుంటే నిప్పెందుకు

నిలువు:

1) చంద్రుడు లేక వెన్నెలుందా 2) నియమాజ 3) లువెగులు 4) గుడుగుడుగుంచములు 9) ఆలుపదుం 10) గాపొపుదు 12) తర్జని

సంచిక – పద ప్రతిభ 238 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version