‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. (Grid 9 x 9).
ఆధారాలు:
అడ్డం:
| 1) లోకము, ప్రపంచకము (3) |
| 3) స్త్రీ, యౌవనవతి (3) |
| 6) ఏరు, ఆమడకు మీరి పారే ఏరు (2) |
| 7) అడవి, తోపు, ఇల్లు, నిలయం (3) |
| 10) దిశ, శరణము, మార్గము, వైపు, వెంపు (2) |
| 11) సంతోషకరం (5) |
| 13) గోప సమూహము, అడవి, తోట, మూల (2) |
| 14) గృహస్థు, శైవుడు కానివాడు (2) |
| 16) లక్ష్మి, నాలుక, పార్వతి, దగ్గఱగా నున్నదానిని తెలుపును (1) |
| 17) హస్తము, దిక్కు, శిఖరము, శివుడు, తోలు (1) |
| 18) చూచి, ప్రసవించి (2) |
| 21) మనిషి – స్త్రీ లేదా పురుషుడు (2) |
| 23) జలము వంటి ద్రవరూప వస్తువు (5) |
| 27) పూజలో వాడే నీరు, పూజకు తగినది (2) |
| 29) నిద్ర, మధ్య అక్షరంలో కొమ్ము లేదు (3) |
| 30) భార్య, పత్ని (2) |
| 31) మహిళ, స్త్రీ (3) |
| 32) కానుక, దేవుళ్ళకు మొక్కుగా కట్టేది (3) |
నిలువు:
| 1) అమ్మ, మాత (3) |
| 2) ఇంటి లోని భాగము, అర (2) |
| 4) మనస్సు, బుద్ధి (2) |
| 5) లభించుట (3) |
| 7) కాన, అడవి (2) |
| 8) పడమరగా ప్రవహించు ఏరు (3) |
| 9) కవనము – 4, 1 (2) |
| 11) ఆనతి, ఆజ్ఞ (2) |
| 12) ఒక అప్సరస, ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాతో తెలుగు సినీరంగంలో ప్రవేశించిన నటి (2) |
| 13) ఇచ్ఛ, అభీష్టము (3) |
| 15) విభాగము, ప్రాతిపదికాదులకుఁ జేర్చెడి ప్రత్యయము (3) |
| 19) కూరుకు (2) |
| 20) విపత్తు, ముప్పు (3) |
| 21) వృథా, నిరుపయోగం (2) |
| 22) భూమి – అక్షరాలు చెదిరాయి (3) |
| 24) వానప్రస్థుఁడు, అడవి, ప్రోగు, అగ్ని (2) |
| 25) భార్య (2) |
| 26) దేవత (3) |
| 28) నిత్యం అర్ఘ్యం – 4, 1 (2) |
| 30) క్రీడించు, నర్తించు, నువ్వులు లోనగువాని గానుగలో వేసి త్రిప్పు (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 డిసెంబర్ 01వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 247 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 డిసెంబర్ 06వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 245 జవాబులు:
అడ్డం:
1) శ్రీఘనము 4) అవారము 7) ఖండకావ్యము 8) గది 10) శ్వాస 11) మువాల 13) కొసరు 14) పలక 15) పరువు 16) ఆశయం 18) రాడు 21) ముత్ర 22) కార్యకర్తలు 24) వందనము 25) వ్యంగ్యముతో
నిలువు:
1) శ్రీరంగము 2) నఖం 3) ముడఎ 4) అవ్యయం 5) వాము 6) ముక్తసరు 9) దివాకరుడు 10) శ్వాసకోశము 12) అలక 15) పరాభవం 17) యంత్రముతో 19) శౌర్యము 20) కర్తవ్యం 22) కాన 23) లుగ్య
సంచిక – పద ప్రతిభ 245 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కరరావు, కోల్‌కత
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు మోహన్ రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- గండ్లూరి జగన్మోహన్ రావు, ఖమ్మం
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులాదత్త కె., ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాద్
- డా. ప్రవీణ
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రామలింగయ్య, టి., తెనాలి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- వరలక్ష్మి హరావే డా., బెంగుళూరు
- జాకీర్ హుస్సేన్, ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

