‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) సూర్యుడు ఉత్తర దిక్కుకు ప్రయాణించే కాలం (6) |
| 5) అలవాటు, లంచం (3) |
| 7) కవి రచించిన గ్రంథము (2) |
| 8) అప్పుపడినవాడు, తవ్వేవాడు (4) |
| 10) రంగు పని చేసే వాడు (3) |
| 13) మంతనాలు చివరి సగం (2) |
| 15) నవగ్రహాలలో ఒకటి (2) |
| 16) టేకు చెట్టు, చివరి అక్షరానికి ఒత్తు లేదు (4) |
| 18) భార్య (2) |
| 19) త్వరగా, ఆలస్యం లేకుండా (4) |
| 20) మన్నన, గొప్పతనం (3) |
| 21) వెల్లుల్లి (4) |
| 23) అటునుండి రుచి చూడండి (2) |
| 24) విడిచిపెట్టాలనే కోరిక (3) |
| 26) ఒక రాక్షసుడు, మన్మథుడు చివరి అక్షరం లేదు (2) |
| 27) అటుగా తక్కెడ సిబ్బి (3) |
| 28) బెల్లం, నీళ్ళు కలిపిన పానీయం (3) |
| 30) బృహస్పతి కుమారుడు (3) |
| 31) చేదు కూరగాయ (3) |
| 32) లక్ష్మి, తేనె (3) |
| 33) పంది (3) |
| 34) కరుణ (2) |
| 35) కాటుక (3) |
నిలువు:
| 1) బోర్లపడని పసిబిడ్డ (5) |
| 2) రాక్షస స్త్రీ, రాక్షసుడు (3) |
| 3) యవలు పండే పొలం, నెల (2) |
| 4) ముఖాముఖిలో తొలి సగం (2) |
| 5) చెట్లు (3) |
| 6) రెండు తర్వాత అంకె, ఆపద కలుగు (2) |
| 9) స్తంభాల మీద వేసే పెద్ద దూలం (3) |
| 11) చెడుకాలం (5) |
| 12) కోరిక (2) |
| 14) మోసగాడు (6) |
| 16) మురికి, మాలిన్యం (3) |
| 17) బంగారము (4) |
| 18) నెమ్మదిగా వదిలేయుట (5) |
| 22) కుక్క (3) |
| 24) తునక, ఖండం (2) |
| 25) కర్పూరం (4) |
| 27) చెల్లా చెదురు, గజిబిజి (4) |
| 29) నెరపు, వెంట్రుకలు తెల్లబడటం (2) |
| 31) వేడిమి, సెగ (2) |
| 32) మోసం, గారడి (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmailcom కు 2026 ఏప్రిల్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద ప్రహేళిక ఏప్రిల్ 2026 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మే 2026 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పదప్రహేళిక – మార్చ్ 2026 సమాధానాలు:
అడ్డం:
1) ఆకాశరామన్న 5) నిస్సంతు 7) తరుణి 8) దాయ 9) రగప 10) గ్రీష్మం 11) మనము 13) దిగువు 15) ఆనంద 16) యజ్ఞం 17) డిడుఅగి 19) ముము 23) కామధేనువు 25) జలగ 27) రవచి 28) కామాలి 29) రలుమ 30) జనని 32) ఎముక 33) ద్వారక 34) కటం
నిలువు:
1) ఆహరణీయము 2) శతపది 3) రారు 4) మణిగ్రీవుడు 5) నియమనం 6) తురుము 12) నదము 14) గుడి 15) ఆగి 18) అనువు 20) ముత్తిగ 21) రామచిలుక 22) యజమాని 23) కావరము 24) నుతి 26) లలి 28) కానక 30) జర 31) ముటం
సంచిక – పదప్రహేళిక – మార్చ్ 2026 కి సరైన సమాధానాలు పంపినవారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- సిహెచ్.వి. బృందావనరావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగళూరు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి. జి, తిరుపతి
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387

