Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక ఆగస్టు 2026

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) భయంకరమైన కల (4)
3) శక్తి గలవాడు, సిరిగలవాడు (5)
7) గాయం/పుండునుండి కారే పల్చని ద్రవం (2)
8) పుప్పొడి (3)
9) గొప్పగా దానం చేయువాడు (3)
13) ముక్కుతో మాట్లాడుట (2)
14) ప్రకృతి కాదు (3)
16) పల్లపు నేల (3)
19) పుణ్యస్త్రీలు నుదుట ధరించేది (3)
20) ప్రేమ, అనురాగం 3
21) జనని (2)
25) విచారణ, సోదా (3)
26) వర్షాధారంతో పంటపండే నేల (3)
27) చిక్కగా కాచిన అంబలి, సంకటి (2)
30) చిన్నపిల్లలకు చిదిపిపెట్టే అన్నం (5)
31) మేలు (4)

నిలువు:

1) ఎర్ర రంగు పొడి (4)
2) దేవలోకం, నాకం (2)
4) గుర్రాల పేడ (2)
5) తన బరువుకు సమానంగా తూచిన ధనం త్యాగం చేయడం (4)
6) ప్రాపంచిక విషయాలతో సంబంధం వదులుకోవడం (3)
10) సరైన, యోగ్యమైన (3)
11) సహజస్థితి (3)
12) చీలమండ క్రింది భాగము (3)
15) నువ్వులు (3)
17) వాంతి (3)
18) గమ్మత్తు, చమత్కారం అటుగా (3)
22) తృప్తి పడుట (4)
23) సర్పము, పాము (3)
24) కీడు, చెడు చేయటం (4)
28) ముగ్గురాయి, తెల్లమన్ను (2)
29) మెట్టు, సోపానం (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmailcom కు 2026 ఆగస్టు 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక ఆగస్టు 2026 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 సెప్టెంబర్ 2026 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక పదప్రహేళిక – జూలై 2026 సమాధానాలు:

అడ్డం:

2. కపాలి 4. రంవారుగు 7. సరసాలు 9. కర్ణము 10. బాకా 11. మొప్ప 12. మేలిమి 15. వ్యాయామం 16. వరవ 20. బలుపు 21. పుల్ల 22. టక్కు 23. వత్తాసు 26. బెండుకొను  27. వరాంగన  28. మడుగు

నిలువు:

1.పసరుమొగ్గ 2. కసాయి 3. పాలు 5. వార 6. గుణాకారం 8. పౌర్ణమి 9. కలిమి 13. మాయావి 14. సారథి 17. పులుసు 18. తెల్ల ఏనుగు 18. కంటరావ 20. బత్తాయి 24. పిడుగు 25. తెగ 26. బెండు

సంచిక పదప్రహేళిక – జూలై 2026 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version