Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక ఫిబ్రవరి 2025

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గడియలో 60వ వంతు (4)
4. విష్ణుమూర్తి గద (4)
8. స్త్రీ, అల్లిత్రాడు అటునుండి (2)
10. బహుమతి (3)
12. రెండు గురువు ఒక లఘువు గల గణం (3)
13. మగ పశువు (2)
14. చెప్పుడు మాట (2)
15. అవకాశం, శోకము, చింత (3)
17. పిరికివాడు, భీరువు (2)
18. రెమ్మ, ఉపశాఖ (3)
19. వంట (3)
20. బేడిస 3,1,2 (3)
23. భోజనం (3)
24. సాధువులో తొలి రెండు అక్షరాలు (2)
25. అగ్ని (2)
26. పరితాపం (3)
27. లక్ష్యం, నమ్మిక (2)
29. తామరకాడు, గొడుగు కాడు అటుగా (2)
31. మూడు పాతికలు (4)
32. ముష్టి (4)

నిలువు:

2. వినాయకుని పూజలో వాడే దూర్వా పత్రం (3)
3. నరం అటుగా (2)
5. తమలపాకుల కట్ట (2)
6. అడవిలో తిరిగే బోయవాడు (4)
7. లోకంలోని వాడుక (4)
9. పొట్టేలు (3)
11. మాట, అపప్రథ (2)
12. తాను అనే అర్థం (2)
15. నోరు, ముఖము (3)
16. ఉపద్రవం, బాధ (3)
17. అయిదింటి సమూహం (3)
18. తగ్గింపు, ముదరా (3)
20. మట్టము, సమము (3)
21. తియ్యదనం, చక్కదనం (4)
22. బతుకు తెరువు (4)
23. ఒక మత్తు పానీయం, మద్యం (3)
24. వ్యవసాయము (2)
28. శవ దహనానికి పేర్చిన కట్టె (2)
29. మడికాసులో తొలి సగం (2)
30. వాయసము (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2025 ఫిబ్రవరి 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక ఫిబ్రవరి 2025 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మార్చి 2025 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక – జనవరి 2025 సమాధానాలు:

అడ్డం:

1) అగ్రజుడు 3) ధనదుడు 7) నర 9) మర 10) దివాలా 12) దవడ 15) జులాయి 17) పద 18) నోరార 20) టిరావ 23) కుయుక్తి 25) పరుడు 26) వమి 28) సరస 31) రాసభం 33) విమలం 34) లావా 35) గిరి 38) సమవర్తి 39) పరిణయం

నిలువు:

1) అగమము 2) జులుం 4) నన 5) దురద 6) రివాజు 8) దడదడ 11) లాలాటి 13) వప 14) కారాకు 16) యిరాప 19) రయుస 21) వరుస 22) శివరాత్రి 24) క్తిరవి 27) మిస 29) సమరం 30) దేవాలయం 32) భంగిమ 36) రివ 37) మురి

సంచిక పదప్రహేళిక – జనవరి 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

Exit mobile version