‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) రాగిరేకు (4) |
| 3) ఒప్పంద పత్రం (5) |
| 7) జ్ఞాతి, పగవాడు (2) |
| 8) నాగలి (3) |
| 9) చివుకపిట్ట (3) |
| 13) తాబేలు (2) |
| 14) వసురాజు భార్య, చిట్టెలుక (3) |
| 16) మేఘం, మబ్బు, కొండ (3) |
| 19) గొడుగు (3) |
| 20) దశరూపకాలలో మొదటిది (3) |
| 21) పాలపిట్ట, కొబ్బరి చెట్టు (2) |
| 25) కాపాడాలనే కోరిక (3) |
| 26) తోట (3) |
| 27) తల్లి, పుడమి (2) |
| 30) సోమరితనం, బద్ధకం (5) |
| 31) నృత్యం చేసే పురుషుడు (4) |
నిలువు:
| 1) ఒకరి చేతి కింద పని చేసేవాడు (4) |
| 2) పండుగ (2) |
| 4) ఊడిపోవు, కిందపడు (2) |
| 5) మంగలివాడు (4) |
| 6) రెండు వీసాలు, ఎనిమిదవ వంతు (3) |
| 10) మనోజ్ఞురాలైన స్త్రీ (3) |
| 11) పర్వతరాజు పుత్రిక (3) |
| 12) మాదిరి, మచ్చు (3) |
| 15) ఏనుగు పిల్ల (3) |
| 17) వెంట్రుకలు లాగడానికి మంగలి వాడే సాధనం (3) |
| 18) ఊడిగం, సపర్య (3) |
| 22) వెలుగులు, కాంతులు (4) |
| 23) గొప్పలు (3) |
| 24) గొడుగు ఉన్నవాడు (4) |
| 28) అగ్నిగుండం, నిప్పులగుంట (2) |
| 29) చేసేవాడు, బ్రహ్మ (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmailcom కు 2026 ఫిబ్రవరి 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక ఫిబ్రవరి 2026 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 మార్చ్ 2026 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పదప్రహేళిక – జనవరి 2026 సమాధానాలు:
అడ్డం:
1) దాక్షాయణి 3) యమకేలుడు 7) కీతు 8) సహజ 9) రుతము 13) నంది 14) మారుతి 16) అహింస 19) వంగడం 20) దీనారం 21) హవం 25) తుదకు 27) కాగు 30) సముదాయము 31) అదాలతు
నిలువు:
1) దారుకీటం 2) యడం 4) మకాం 5)లుచ్ఛాతనం 6) దేహజ 10) ముదిత 11) పరువం 12) మెహిందీ 15) తిగలు 17) సనాథ 18) తాహతు 22) వందనము 23) మడమ 24) త్రాగుబోతు 28) కోయ 29) ఆదా
సంచిక – పదప్రహేళిక – జనవరి 2026 కి సరైన సమాధానాలు పంపినవారు:
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్తకె, ఆదోని
- పివి రాజు, హైదరాబాద్
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగళూరు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387

