‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తనకన్నా ముందు జన్మించిన వాడు (4) |
3. కుబేరుడు, దాత (4) |
7. వెంట్రుకలు తెల్లబడుట (2) |
9. యంత్రం, తిరుగుడు చీల (2) |
10. ఆర్థికంగా కృశించిన స్థితి (3) |
12. చెక్కిలి లోపలి భాగం (3) |
15. పోకిరిగా తిరిగే వ్యక్తి (3) |
17. పదపద లో సగము (2) |
18. నోటి నిండా (3) |
20. ముతక బట్ట, ఒక రాగం – అటుగా (3) |
23. కపటోపాయము (3) |
25. పగవాడు, ఇతరుడు (3) |
26. వాంతి, నిప్పు (2) |
28. చేరువ, చెంత (3) |
31. గాడిద (3) |
33. నిర్మలమైనది (3) |
34. అగ్నిపర్వతం వెదజల్లే శిలాద్రవం (2) |
35. వలయాకారపు రేఖ (2) |
38. యముడు (4) |
39. వివాహం, పెళ్ళి (4) |
నిలువు:
1. కొండ, చెట్టు (4) |
2. దౌర్జన్యం (2) |
4. చిగురు, పుష్పము (2) |
5. జిల, కనరు (3) |
6. వాడుక (3) |
8. గుండె కొట్టుకోవడంలో ధ్వన్యనుకరణ (4) |
11. నుదురు (3) |
13. నాభి కింద ఉండే ఉల్లి పొర (2) |
14. పండుటాకు (3) |
16. ఇతరులకు సంబంధించినది, క్రింద నుండి (3) |
19. అయోధ్య నగర సమీప నది, అటుగా తడబడింది (3) |
21 శ్రేణి, పంక్తి.(3) |
22. మాఘ మాస కృష్ణ చతుర్దశి ఉపావాస దినం (4) |
24. వైరాగ్యం అటుగా (3) |
27. కాంతి (2) |
29. యుద్ధం (3) |
30. గుడి (4) |
32. అంగ విన్యాసం, విధము (3) |
36. శాలి ధాన్యము, అటుగా (2) |
37. నడక లోని కులుకు (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2025 జనవరి 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక జనవరి 2025 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఫిబ్రవరి 2025 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక – డిసెంబర్ 2024 సమాధానాలు:
అడ్డం:
1.భరిణ 3. రవణ 5. అతి 7. దాక 8. భచక్రం 9. వగరు 10. రజన 11. కుడితి 12. సవనం 13. కంతయు 15. సరళి 16. ముదుపం 17. సవ 18. నాము 19. కారకం 20. మొహరి 21. వరాళి 22. గిరిజ 23. కులుకు 24. గిరాకి 26. బెరుకు 27. సదాటు 28. కీడు 29. త్తవ 30. బంభరం 31. ఎలుక
నిలువు:
1.భదాకం 2. రిక 3. రచన 4. వక్రం 5. అగతి 6. తిరు 8. భజనం 9. వడియు 10. రవళి 11. కుతపం 12. సరము 13. కందుకం 14. తోవరి 15. సనాథ 16. మురళి 17. సహజ 19. కారాకు 20. మొరికి 21. వలుకు 22. గిరాటు 23. కురువ 24. గిదారం 25. వాడుక 27. సభ 28. కీలు
సంచిక – పదప్రహేళిక – డిసెంబర్ 2024కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధసాయి జొన్నలగడ్డ
- ద్రోణంరాజు వెంకట మోహన రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావఝల శారద
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387