Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక జనవరి 2026

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) సతీదేవి, పార్వతి (4)
3) విష్ణువు (5)
7) కొబ్బరి ఆకుల చాప (2)
8) తోబుట్టువు, సోదరి (3)
9) పశుపక్ష్యాదుల అరుపు (3)
13) శివుని వాహనమైన వృషభం (2)
14) హనుమంతుడు, భీముడు (3)
16) హింస చేయకపోవడం, గాంధీ సిద్ధాంతం (3)
19) పంటలలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసే రకం, వంశం (3)
20) బంగారునాణెం (3)
21) యజ్ఞం, హోమం (2)
25) చివరకు (3)
26) పానుపు, శయ్య (3)
27) పెద్ద బాన, రాగి బిందె (2)
30) సమూహం, గుంపు (5)
31) న్యాయసభ, కోర్టు (4)

నిలువు:

1) కర్రను తొలిచే కీటకం (4)
2) దూరం (2)
4) విడిది చేసే చోటు, బస (2)
5) అల్పత్వం, నీచత్వం (4)
6) కూతురు, తనయ (3)
10) స్త్రీ, వనిత (3)
11) ప్రాయం, తగిన సమయం (3)
12) గోరింటాకు, మధ్య అక్షరాన్ని చాలామంది ‘హం’ అని పలుకుతారు, రాస్తారు (3)
15) ఒకే కాన్సులో పుట్టిన ముగ్గురు పిల్లలు (3)
17) ముత్తయిదువ, మగడు గల స్త్రీ (3)
18) స్తోమత, శక్తి (3)
22) నమస్కారము, పొగడ్త (4)
23) చీలమండ కింది భాగం (3)
24) మద్యంకు బానిస అయినవాడు (4)
28) ఒక గిరిజన జాతి (2)
29) రాబడి, లాభం – చివర ‘యం’ లోపం (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmailcom కు 2026 జనవరి 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక జనవరి 2026 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఫిబ్రవరి 2026 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పదప్రహేళిక – డిసెంబర్ 2025 సమాధానాలు:

అడ్డం:

1) నాభి 2) కితకితలు 6) సెరగు 7) యోగి 8) పగ 10) ప్రజ 11) పార 12) కాకులు 14) తినము 16) కకవికలు 18) రేఫ 19) లవము 20) వ 22) మారాము 26) తాటక 27) స్వారీ 28) వావి 29) చెంగావి 30) ముముక్ష 31) కూడు

నిలువు:

1) నాడి. 2) కిర 3) తగు 4) తఖ్తు 5) జోగి 6) సెగ 7) యోజన 8) పరక 9) కీలు 10) ప్రతిఫలము 11) పాకము 12) కాక 15) ముఠా 17) విన్ను 21) నాటకము 23) రాలుగాయ 24) మారీచుడు 25) రివాజు

సంచిక – పదప్రహేళిక – డిసెంబర్ 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version