‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) సింహం (4) |
| 3) ఇలకోడి, చిమ్మట (5) |
| 6) మోసం (2) |
| 7) ఎక్కువ పదును పెట్టినది (3) |
| 9) తాటి టెంక నుండి మొలచిన మొలక (2) |
| 10) తోక (2) |
| 11) పాడదగిన ధ్వనుల వరస (2) |
| 12) ఉడికీ ఉడకని బియ్యం (4) |
| 13) ప్రజలు (2) |
| 14) సత్య క్రియలో తొలిసగం (2) |
| 15) ఎడమ వైపు (3) |
| 16) బానిస (3) |
| 19) పెంపుడు తల్లి (2) |
| 21) పాదలేపనంతో తీర్థయాత్రలు చేసినవాడు (4) |
| 22) ఉన్మాదం, పిచ్చి (2) |
| 25) అర్చకుడు (3) |
| 27) తగవులు పెట్టే వ్యక్తి (5) |
| 28) బ్రహ్మ (3) |
నిలువు:
| 1) రోలు (3) |
| 2) కాపాడబడినది (3) |
| 3) వయస్సు (2) |
| 4) అభివృద్ది (4) |
| 5) పూర్తిగా స్వాధీనంలో ఉంచుకొనడం (6) |
| 6) నేర్పరితనం (3) |
| 8) దిట్టతనం లేనివాడు (4) |
| 9) రెల్లుగడ్డి, వెదురు (3) |
| 10) గడువు (3) |
| 13) మురికి నీళ్ళు పోయేదారి (4) |
| 14) సముద్రంలో ముత్యపు చిప్పలు ఏరడం (3) |
| 17) శుభకరమైన ప్రాతః కాలము (4) |
| 18) తులసిదళాలు, పూలు కట్టిన దండ (4) |
| 20) ఇటుక, మన్నుతో కట్టే స్తంభం (2) |
| 23) పండితుడు (2) |
| 24) పార్వతి (2) |
| 25) బతుకమ్మను వీటితో అలంకరిస్తారు (2) |
| 26) నూకలు, పిండితో వండిన పదార్థం (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2025 జూలై 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద ప్రహేళిక జూలై 2025 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఆగస్ట్ 2025 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక – జూన్ 2025 సమాధానాలు:
అడ్డం:
1) ఆమూలాగ్రం 3) అరుణోదయం 7) కాకి 8) కవ్వము 9) చకోరం 12) రూపసి 14) తగాదా 16) పై 17) రు 18) గపాలు 19) రురువు 23) గడన 24) లహరి 25) అటి 28) అడవికుక్క 29) అసువులు
నిలువు:
1) ఆరకాటి 2) లాక 4) రుబ్బు 5) దగాకోరు 6) బువ్వము 10) ఆపగ 11) కంగారు 13) సిపాయి 15) దారుణం 20) గడబిడ 21) ప్రహరి 22) అటికలు 26) ఆకు 27) ఆసు
సంచిక – పదప్రహేళిక – జూన్ 2025 కి సరైన సమాధానాలు పంపినవారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మంజులదత్త.కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- రామకూరు నాగేశ్వరరావు. శ్రీకాకుళం
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగళూరు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387

