Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక జూన్ 2026

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

టి రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) ఎగతాళి, అపహాస్యం (4)
3) రహస్యజీవనం, పాండవులు చేసినది (5)
6) రావణుని పట్టణం (2)
7) ఆచూకీ, దారి (2)
8) పొలానికి కాపలా కాసేవాడా? (3)
11) అచ్చువేసినది. చివరి అక్షరాలు తడబడ్డాయి (4)
12) పగటిపూట (3)
13) తన బరువు తూనికగల బంగారం మొదలగువానిని దానము చేయుట (5)
14) యథార్థం కానిది (5)
17) ఒడ్డు, తీరం (2)
18) ఒకరి చేతి కింద పని చేసేవాడు (4)
21) గర్వశీలుడు, అహంకారి (5)
24) ఒక నక్షత్రమా? విదిక్కా (2)
26) దిష్టి తీయడం (5)
27) అనారోగ్య సమయంలో ఉపవాసం (4)

నిలువు:

1) ముంగిస (4)
2) అటుగా తొట్రుపాటు (4)
3) లెక్కకు రాని సొమ్ము (5)
4) తోక (2)
5) కలపడం, కూర్పు (5)
7) ఏడున్నర గడియల కాలం (2)
9) అటుగా బలం ఉన్న వ్యక్తి (3)
10) అటుగా ఎడమపాదం చివరి అక్షరాలు తడబడ్డాయి (3)
14) తూణీరం, బాణాలుంచే ఒర (5)
15) వ్యర్థము, వమ్ము (2)
16) ఇతరులను తృప్తి పరిచే చర్య. 3, 4 అక్షరాలు తడబడ్డాయి (5)
18) ఎర్రని వేరు (4)
19) రక్తము (4)
20) వింత, ఆశ్చర్యం (3)
22) ‘గ’ లు (2)
23) దిబ్బ, ఎత్తైన చోటు, బోడియైన (2)
25) పక్షి ఈక, మొలక (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmailcom కు 2026 జూన్ 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక జూన్ 2026 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూలై 2026 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక పదప్రహేళిక – మే 2026 సమాధానాలు:

అడ్డం:

1) అభివ్యాప్తి 3) కిరణ్ బేడీ 7) జమ్ము 8) భగిని 9) మసాలా 13) రంభ 14) తగరం 16) మాసిక 19) డమాను 20) కందుకం 21) సామి 25) మితము 26) ఊతము 27) స్వాతి 30) కంషితోరిపా 31) రజతము

నిలువు:

1) అభోజనం 2) వ్యాఘ్రి 4) రహి 5) బేరసారం 6) లోగిలి 10) లాభము 11) లోగడ 12) బాసికం 15) రంమాకౌ 17) కదుము 18) ఆసామి 22) మితభాషి 23) సంతతి 24) నైతికము 28) విరి 29) కుజ

సంచిక పదప్రహేళిక – మే 2026 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version