‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 2) దినచర్య పట్టీ, పద్దుల పట్టి (3) |
| 6) జాగ్రత్త, భద్రం (3) |
| 7) బహుమతి, కానుక (4) |
| 8) అమావాస్య (3) |
| 9) తన పేరుకు బదులు వేరొకరి పేరు చూపించడం (3) |
| 11) ఆలోచన, ఉపాయం చెప్పుట (3) |
| 13) కరుణ (2) |
| 15) అగ్ని, నెమలి (2) |
| 16) వర్ణము (2) |
| 19) ఓర్పు, క్షమ (3) |
| 22) గంగానది (3) |
| 23) క్రయ విక్రయాల వల్ల వచ్చే ఆదాయం (3) |
| 24) మొదలు, ప్రారంభం (3) |
| 28) జీలకర్ర (2) |
| 29) ఆడంబరం, అతిశయం (2) |
| 31) రావడం, పున్నమి (2) |
| 32) ఎటునుంచైనా అధికం (3) |
| 33) చెంత, సమీపము (4) |
నిలువు:
| 1) చెరసాల, జైలు (4) |
| 3) జరుగుచున్న కాలం (4) |
| 4) విమోచనం (4) |
| 5) నాగలి (3) |
| 9) అడుక్కోవడం, యాయవారం (2) |
| 10) ఉపరితలం, పైన (2) |
| 11) చెలికత్తె (2) |
| 12) భిన్నంలో కింది భాగం (2) |
| 14) ముని (2) |
| 15) దండన, వేదాంగాలలో ఒకటి (2) |
| 17) లక్ష్యం, నమ్మిక (2) |
| 18) గుర్తు, టెక్కము (3) |
| 20) చీకటి, అంధకారం (3) |
| 21) తొలి తెలుగు సంవత్సరం (3) |
| 24) జాడ, ఆచూకి (2) |
| 25) కోశాధికారి (3) |
| 26) అసలుకు ప్రతిరూపం (3) |
| 27) వజ్రాయుధం (2) |
| 28) ప్రాణి (2) |
| 30) సర్ప ధ్వని (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmailcom కు 2026 నవంబర్ 10వ తేదీ లోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద ప్రహేళిక నవంబర్ 2026 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 డిసెంబర్ 2026 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పదప్రహేళిక – అక్టోబర్ 2026 సమాధానాలు:
అడ్డం:
1) నయపీఠి 3) నాగవల్లరి 6) బావ 7) నాటకశాల 9) వరారోహ 10) రేరాజు 11) యాచనకుడు 14) నాడు 15) నావికుడు 16) రోహిషము 18) కలు 19) పగ 22) డులి 24) రాచనగరు 25) డిగు 27) విరివి 28) ప్రముఖుడు
నిలువు:
1) నయానా భయానా 2) పీఠిక 3) నావ 4) వలరాజు 5) రిక్తహస్తుడు 6) బాల 8) శాసకుడు 9) వరారోహి 12) చవిక 13) నకులుడు 14) నాము 16) రోగరాజము 17) షడాననుడు 20) తీరుబాటు 21) నిడివి 23) లిపి 26) గురి
సంచిక – పదప్రహేళిక – అక్టోబర్ 2026 కి సరైన సమాధానాలు పంపినవారు:
- అరవ భాస్కర రావు, కోల్కతా
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- సిహెచ్.వి. బృందావనరావు, నెల్లూరు/అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మంజులదత్త కె, ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- వరలక్ష్మి హరావే డా., బెంగుళురు
- వర్ధని మాదిరాజు, బెంగుళూరు
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387

