Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పదప్రహేళిక అక్టోబర్ 2022

‘సంచిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఈ రాయడు దరిద్రుడు (4)
4. దట్టమైన అడవి (4)
7. ఉత్తరము (2)
8. చెట్టు (2)
9. మోసం చేయాలనే కోరిక (2)
11.సాయంకాలము (2)
13. హస్తము (4)
14. అలనాటి కవయిత్రి వెంగమాంబ ఇంటి పేరు (4)
15. సెల్ ఫోన్ (4)
18. చాలు చాలు (4)
21. గ్రీకు అక్షరం (2)
22. నేరస్థుడు (2)
23. కక్ష (2)
25. చలించు (2)
27. ఒక తిథి (4)
28. సిక్కుల మత గురువు (4)

నిలువు:

1. పసుపు వన్నె రత్నం (4)
2. గీతము (2)
3. తలకు చుట్టుకునే వస్త్రం (4)
4. మహిషారుడి బారినుంచి ప్రజలను కాపాడిన తల్లి (4)
5. తల్లక్రిందులైన వరహాలో సగం (2)
6. గుర్రం జాషువా జన్మస్థలం (4)
10. రోత ముందు లేదు తరువాత తిరగబడింది (2)
12. పట్టణము (2)
15. గబ్బిలము (4)
16. అమృత్ సర్ వద్ద ఉన్న ఇండియా పాకిస్తాన్ బోర్డర్ (2)
17. అధ్భుత రత్నం అటునుంచి (4)
18. సమానమగు (4)
19. ఒక కాయ – అటునుంచి (2)
20. బ్రితిష్ ప్రధాన మంత్రిగా పోటీ చేసిన భారత సంతతివాడు (4)
24. ఆసనాల ప్రక్రియ – శీర్షాసనం వేసింది (2)
26. ఎద్దు (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022  అక్టోబర్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక అక్టోబర్ 2022 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 నవంబర్ 2022 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- సెప్టెంబర్ 2022 సమాధానాలు:

అడ్డం:

1.మరువము 4. బావాబావా 7. శిల 8. జాన 9. చిక్క 11. కగ్గు 13. కరివేప 14. ముసలము 15. తెలివాక 18. అభిజ్ఞాన 21. నిషా 22. తల్ల 23. చాటు 25. దిస 27. పటాలము 28. గబ్బులుగు

నిలువు:

1.మరీచిక 2. వశి 3. ములదప 4. బాసికము 5. బాజా 6. వానరము 10. క్కరి 12. గ్గుస 15. తెరచాప 16. వాని 17. కషాయము 18. అనాదిగ 19. జ్ఞాత 20. నల్లనాగు 24. టుట 26. సబ్బు

సంచిక పదప్రహేళిక- సెప్టెంబర్ 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

గమనిక:

క నుంచి హ వరకు ఉన్న అక్షరాలు స్వయం ప్రకాశికాలు కావు.

క్ + అ = క అవుతుంది.. అంటే క నుంచి హ వరకు అన్ని కూడా ఏదో ఒక అచ్చుతో కలిసినపుడు అవి ప్రాణమున్న అక్షరాలు అవుతాయి కనుకనే అవి ప్రాణులు అని పిలువ బడుతున్నవి.

క్ అనే దానికి అర్థంలేదు కనుక నక్, ముల్, మున్… ఇవన్నీ ఏకాక్షరాలే అవుతాయని గమనించగలరు.

Exit mobile version