Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచికలో 25 సప్తపదులు-17

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
ఓంకారం
శ్రీకారం
యోగసాధనతో పొందవచ్చు ఎవరైనా స్వామి సాక్షాత్కారం

శాంతమూర్తి
హైదరాబాద్

2
కృతులు
శృతులు
భక్తితో సమర్పిస్తే స్వామికి అవే అలంకృతులు

శేష శైలజ( శైలి)
విశాఖపట్నం

3
భావన
ప్రస్తావన
శ్రద్ధ తీసుకువస్తుంది మనస్సులో నిశ్శబ్దం, పావన.

కె. ఎమ్. కె. మూర్తి
సికింద్రాబాద్

4
అదును!
చదును!!
చెడు ఆలోచనలకు ఎప్పుడు పెట్టకూడదు పదును!!!

ఎమ్మెస్సార్ భార్గవి ప్రియ
విజయవాడ

5
జీవనం
సేవనం
నిర్భాగ్యులకు, వృద్ధులకు సహాయపడిన బ్రతుకే పావనం!

బత్తిన గీతాకుమారి
సత్తుపల్లి, ఖమ్మం జిల్లా

6
చలి
చెలి
చెంతన జేరగ వెచ్చన నిచ్చును కౌగిలి.

క్రొవ్విడి వెంకట బలరామమూర్తి
హైదరాబాద్.

7
వీర్యం
శౌర్యం
చేసిన తప్పును ఒప్పుకొనుటకు కావాలి మనోధైర్యం

నెల్లుట్ల శ్రీనివాసులు
చెన్నై

8
వేధించకు
సాధించకు
నిన్ను నమ్మి వచ్చిన ఇల్లాలిని బాధించకు..!!

శ్రీమతి భారతీకృష్ణ
హైదరాబాద్

9
లోకం
నాకం
అన్నార్తులకి పెట్టేటప్పుడు ఎప్పుడూ వేయరాదు తూకం

ఉపద్రష్ట సుబ్బలక్ష్మి
హైదరాబాద్

10
పొదుపు
మదుపు
లేకుంటే జీవితంలో ప్రతిరోజూ కోలుకోలేని కుదుపు

కాయల నాగేంద్ర
హైదరాబాద్

11
కృతి
శృతి
వీనులకు విందు, మనసుకు కలుగు ధృతి

పంతుల లలిత-నీలాంజన
విశాఖపట్నం

12
సేద్యo
వైద్యం
విద్యలకు ప్రోత్సాహం కల్పించే ప్రభుత్వపాలనయే జనహృద్యం

అ.వెం.కో. రామాచార్యులు
కాకినాడ.

13
నసనస
రుసరుస
వాదప్రతివాదాల్లో ఉండి తీరాలి ఎంతోకొంత పస!!

నమ్మి ఉమాపార్వతీ నాగ్,
చెరుకువాడ.

14
మేధ
గాధ
తెలివి ఎక్కువైనా తక్కువైనా తప్పదు బాధ!

డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచార్య
మహబూబ్ నగర్.

15
వీక్షణ!
రక్షణ!!
మొక్కలు నాటడమే కాకుండా చేయాలి సంరక్షణ!!!

లయన్:కంబాల తిమ్మారెడ్డి
కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా

16
పాదాత్మకం
కావ్యాత్మకం
అష్టపదుల్లో భక్తి, శృంగారం, శ్రోతలకు ప్రేరణాత్మకం

వై పద్మ
హైదరాబాద్

17
ఎత్తు
విపత్తు
ఎంత సాధించినా కర్మఫలం చేయగలదు చిత్తు

వి శ్రీనివాస మూర్తి
హైదరాబాదు

18
నల్లి
బల్లి
అల్పజీవుల్ని కూడా చలనచిత్రంగా తీయగలరు కథలల్లి.

భమిడిపాటి వెంకటేశ్వర రావు
హైదరాబాద్.

19
ఆవేశం
ఆక్రోశం
తప్పని చెప్పినా నిత్యం జరిగేదే సన్నివేశం

డాక్టర్ వరలక్ష్మి హరవే,
బెంగుళూరు

20
ఆచారం
విచారం
మూఢాచారం దేశాన్ని వదలక పీడిస్తున్న గ్రహచారం!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

21
పెట్టుబడి,
దిగుబడి,
వీటి మధ్య సమన్వయమే కదా రాబడి.

వేము విజయ్ కుమార్.
మనుబోలు నెల్లూరు జిల్లా

22
సహనము
అసహనము
వీటిమధ్య వ్యత్యాసమెక్కువై అవుతున్నాయి మనస్సులు దహనము!!!

బొంతు సూర్యనారాయణ
విజయనగరం జిల్లా

23
చరితము
భరితము
రామకథ ఆదర్శపూరితము, అనుసరించిన దూరమగు దురితము

కాళీపట్నపు శారద
హైదరాబాదు

24
ప్రభాతము
నిపాతము
చెడు అలోచనలు సమాజానికి కలిగిస్తాయి విఘాతము.

నాగరాజు.చుండూరి
లండన్

25
ఆరాటం
పోరాటం
ఆశాజీవి బతుకెప్పుడు పడినా లేచే కెరటం.

డోల రాజేశ్వర రావు,
పలాస.

~

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version