Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచికలో 25 సప్తపదులు-29

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
విలువలు
వలువలు
మనిషి గౌరవాన్ని మర్యాదను కాపాడే చలువలు..!!

గజ్జెల శ్రీనివాసులు
నంద్యాల

2
చరుపు
చెరుపు
కష్టాలను చీల్చితే చీకటిలో నక్షత్రాల్లా మెరుపు

అభిషేక్
హైదరాబాద్

3
అన్నది
విన్నది
నీవు కానప్పుడు అసత్యప్రచారాలకు అవకాశం ఉన్నది

డా. గాదిరాజు మధుసూదనరాజు,
అనంతపురము.

4
కలం
బలం
రచయితకు తన మేధస్సు ఆలోచనలు సకలం!

పప్పు సుజాతారావు
వైజాగ్

5
మిసమిసలు
గుసగుసలు
ఎంత అన్యోన్యమైన దాంపత్యమైనా తప్పవు రుసరుసలు

ఉదండ్రావు రమణబాబు
నరసన్నపేట

6
ప్రవేశం
ఆవేశం
కాకూడదు రసాభాస మన వలన సమావేశం

ద్విభాష్యం నాగలక్ష్మి
అనకాపల్లి

7
విచక్షణ
సులక్షణ
సంక్రాంతికి పిల్లలు రాకకై తల్లిదండ్రులు నిరీక్షణ.

బలివాడ వేణు గోపాల రావు,
హైదరాబాద్.

8
బడి
రాబడి
ఒకటే తొందర – చేసుకోవాలని పెట్టుబడిని ఇబ్బడిముబ్బడి.

శ్రీపెరంబుదూరు నారాయణ రావు
హైదరాబాద్.

9
వేదవల్లి
జ్ఞానవల్లి
అర్థం చేసుకొన్నవారికి ఆనందాల అపురూపాల కల్పవల్లి!

గన్నోజ పద్మావతి
మహబూబ్ నగర్.

10
వనము
కవనము
మార్గ శీర్షమున మురారి స్పర్శతో గరికలే, బృందావనము

వీరేశ్వర రావు మూల
అమలాపురం

11
దోషము
ద్వేషము
మంచికోసం మందలించినా మనిషికి తన్నుకొస్తుంది రోషము

కాళీపట్నపు శారద
హైదరాబాదు

12
తీరిక
కోరిక
అనుకున్నది సాధించాలనుకుంటే కావాలి నలుగురితో చేరిక

డాక్టర్ వరలక్ష్మి హరవే
బెంగుళూరు

13
కాలం
కలికాలం
తిరిగిరాని గతంకై ఆలోచించకు చేజారనీయకు వర్తమానకాలం

జె.విజయకుమారి
విశాఖపట్నం

14
గణితము
విదితము
కృషికి పట్టుదల కూడితే వచ్చేదే సత్ఫలితము

డా.పి.వి.రామ కుమార్
హైదరాబాద్

15
అజ్ఞానం
విజ్ఞానం
తమస్సు నుండి ఉషస్సుకు చేర్చునది బ్రహ్మజ్ఞానం

సుధా స్వామి
విశాఖపట్నం

16
ఎగుడు
దిగుడు
దిగజారిన నాయకులను జనాలు ఆడిస్తారు చెడుగుడు!

డాక్టర్ శైలజ మామిడాల
హనుమకొండ

17
నిండదు!
పండదు!
సంతృప్తి లేకుంటే జీవితంలో సంతోషం ఉండదు!

సిహెచ్. వి. బృందావన రావు
నెల్లూరు

18
కృతం
సుకృతం
పొందిన మేలు మరవకపోతే వ్యక్తిత్వం ద్విగుణీకృతం.

ఆర్ ఎస్ రాజకుమార్
విశాఖపట్నం

19
వెనకొస్తాది
గెలిపిస్తాది
విజయం నీడలాంటిది.. వెలుగులోకి నడిస్తే అనుసరిస్తాది

కోటమహంతి వెంకటరావు(కోవెరా),
విశాఖపట్నం,

20
ధనుర్మాసం
ఉపవాసం
పాశురగానంతో గోదా పొందెను కృష్ణుని సహవాసం

K సత్యనారాయణ,
విశాఖపట్నం

21
బోధకుడు
ఉద్బోధకుడు
పాపుల విముక్తికి రక్తాన్నిచ్చిన ఏసు ఆరాధకుడు

వి నాగమణి
హైదరాబాద్

22
అతుకులు
గతుకులు
ఆకలి తీరడానికి కావాలి గుప్పెడు మెతుకులు

కానుకొలను లక్ష్మీ సీత
హైదరాబాద్

23
చలిచింత
గిలిగింత
చలిగిలి దరి చేరదు ఇసుమంతైన చెలిచెంత!!

మొర్రి గోపి
కవిటి

24
నాడి
విడనాడి
పరీక్షల పేరుతో దోచేస్తున్నారు ఆస్పత్రులు మున్నాడి

వి శ్రీనివాస మూర్తి
హైదరా బాదు

25
లోపం
శాపం
శ్వాస ఆగిపోగానే బయటికి పోతుంది ఆత్మ దీపం..

సంధ్య జంగాల (భాస)
కంకిపాడు

~

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version