[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]
~
1
కదులు
మెదులు
తెల్లవారగానే మనస్సును తట్టిలేపుతాయి మన సప్తపదులు
చింతపల్లి.వేణుగోపాలకృష్ణ,
కాకినాడ
2
సుకృతము!
ఆకృతము!
విశ్వాన జీవి మనుగడ కలుషితాన వికృతము!
లింగాల యుగంధరాచారి,
మదనపల్లె
3
ధ్యేయాలు
హేయాలు
ఓటర్లను వెర్రిబాగులుగా వాగ్దానాలతో మురిపించేవే రాజకీయాలు.
బెహరా నాగభూషణరావు,
గజపతినగరం
4
శిల్పకళ
హస్తకళ
మానసికవికాసానికి ఒక మంచి సాధనం చిత్రకళ
నెల్లుట్ల శ్రీనివాసులు
చెన్నై
5
రాధాదేవి
గోదాదేవి
తిరుప్పావైకి అంకితమైనారు శ్రీరంగదేవులు, శ్రీదేవి, భూదేవి.
D. రమా సత్యా దేవి
సికింద్రాబాద్
6
శ్రీదేవి
భూదేవి
ధనుర్మాసంలో పూలమాలలతో, పాశురాలతో కృష్ణారాధనకి గోదాదేవి
శైలజ సామినేని
విజయవాడ
7
తొందర
ముందర
జీవితంలో పనికి ముందు ఆరాటపడితే చిందరవందర!
డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచార్య
మహబూబ్ నగర్.
8
గర్వము
సర్వము
ధనంతో మిడిసిపడిన. మొదలగు అవమానాల. పర్వము!
జంజం కోదండ రామయ్య
జమ్మిపాళెం
9
దేవాలయం
దేహాలయం
సద్భావనలతో వెలగాలి నక్షత్రదీపమై పవిత్రమైన రాగాలయం!
బత్తిన గీతాకుమారి
సత్తుపల్లి
10
పడగొడుతుంది
చెడగొడుతుంది
మితిమీరిన అహంభావం అందరితో బంధాలను విడగొడుతుంది..!!
శ్రీమతి భారతీకృష్ణ
హైదరాబాద౧౦
11
ఆత్మ
పరమాత్మ
పరులను తనవారి వలె ఓదార్చునది ధన్యాత్మ.
పట్నాల ఈశ్వరరావు
విజయనగరం
12
గాయం
గేయం
క్రమేపీ పాఠ్యపుస్తకాల్లో తెలుగు భాష మాయం
ధరణికోట శివరామప్రసాద్
హైదరాబాద్
13
అహంకారం
అలంకారం
దగ్గరైన దూరానికి దూరమైన చేరువంటే వెటకారం.
మురళి ఎఱ్రాప్రగడ
పలివెల.
14
శ్వాసము
విశ్వాసము
మంచి నడవడిక కోల్పోయిన ఏర్పడును అవిశ్వాసము.
బగ్గాo సోమేశ్వరరావు
విశాఖపట్నం
15
నాదైనా
నీదైనా
వెంట తీసుకెళ్లేది అంటూ ఉంటుందా ఏదైనా
పార్లపల్లి నాగేశ్వరమ్మ (టీచర్)
నెల్లూరు
16
అవగాహనం
మోహనం
రేపటికి బలం అవుతుంది ఈరోజు సహనం.
కే. ఎం. కే. మూర్తి
సికింద్రాబాద్
17
సాయంతో
మాయంతో
పుట్టింది ఇల్లాలికైనా, కన్యకైనా గిట్టింది గాయంతో
(క్రీస్తు, కృష్ణలలో సారూప్యము)
వి నాగమణి
హైదరాబాద్
18
లాలిపాట
జాలిపాట
అమ్మ ఒడిలో అమృతతుల్యం పిల్లలకు జోలపాట
శాంతమూర్తి
హైదరాబాద్
19
ప్రేమాలయం
కరుణాలయం
మంచిని ఔపోసన పట్టిన మనసొక దేవాలయం!
నరహరి రావు బాపురం
అనంతపురము
20
భద్రాణి
ఇంద్రాణి
పసుపుపచ్చని మాగాణి – పుడమి పాదాలకు పారాణి
కాకర్ల చెంచలరావు
ఒంగోలు
21
జీతం
గీతం
సమయానికి అందితే సామాన్యుల ఇంట యుగళగీతం.
అల్లంరాజు రాధాకుమార్ (రాధాయి)
హైదరాబాద్
22
ఆచారం
దురాచారం
జాతక జోస్యాలతో దోచుకొనేవాళ్ళు ఉండడం గ్రహచారం
శేష శైలజ(శైలి)
విశాఖపట్నం
23
జ్ఞానము
విజ్ఞానము
కులాలు, మతాల కుమ్ములాటలే ఆధునిక అజ్ఞానము
వనపర్తి గంగాధర్
హన్మకొండ
24
పాళి
కేళి
ఇతరులను అనవసరంగా దెప్పిపొడుస్తూ చేయబోకు ఎగతాళి
కానుకొలను లక్ష్మీ సీత
హైదరాబాద్
25
ఎంచాలి
పంచాలి
అహమైనా ఆత్మాభిమానమైనా అదుపులోనే ఉంచాలి.
శ్రీనివాస్ పుణ్యమూర్తుల
హైదరాబాద్
~
(మళ్ళీ కలుద్దాం)