[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]
~
1
మలుపులు
గెలుపులు
అందించే నవవత్సరo తేజమా నీకివే కొలుపులు
బత్తిన గీతాకుమారి
సత్తుపల్లి
2
వదలాలి
మెదలాలి
కొత్త సంవత్సరంలో నూతనోత్సాహంతో.. ముందుకు కదలాలి
కాకర్ల చెంచలరావు,
ఒంగోలు.
3
కోపాలు
తాపాలు
తెంచుకోలేని బంధాలతో పంచుకోలేని బాధలతో ఆపసోపాలు.
మురళి ఎఱ్రాప్రగడ
పలివెల.
4
ఎంచుకో
ఉంచుకో
సౌజన్యాన్ని పెంచుకొని సంతోషాన్ని నలుగురితో పంచుకో
నెల్లుట్ల శ్రీనివాసులు
చెన్నై
5
పండాలి
నిండాలి
ధర్మమార్గాన్ని అనుసరించేవారు ఆకర్షణకు దూరంగా వుండాలి
రాయవరపు సరస్వతి
చోడవరం, అనకాపల్లి జిల్లా
6
సమానం
కొలమానం
మానవాళికి మేధస్సు, ఆయురారోగ్యాలు భగవంతుడిచ్చిన బహుమానం.
బలివాడ వేణు గోపాల రావు,
హైదరాబాద్.
7
కలుగు!
వెలుగు!!
నమ్మకంతో అడుగేస్తే జీవితంలో ఇబ్బందులు తొలుగు!!!
ఎమ్మెస్సార్ భార్గవి ప్రియ
(Pharma-D : 1st year)
విజయవాడ
8
వాన
కోన
పుడమి తల్లికి ప్రకృతి ఇచ్చిన నజరానా
చెళ్ళపిళ్ళ శ్యామల
విజయనగరం
9
తిడతారు
కొడతారు
మనుషులు నాలుక వలన చిక్కుల్లో పడతారు!
అంజనీదేవి శనగల
విశాఖపట్నం
10
ఒప్పరు
కప్పరు
ధీశాలులు ఎన్నటికీ అధర్మ మార్గాన్ని చెప్పరు
సింగీతం విజయలక్ష్మి
చెన్నై
11
క్లుప్తము
నిర్లిప్తము
పదాలపొదుపు, భావాలమెరుపు భాషలో నిరంతరం నిక్షిప్తము.
డబ్బీరు ప్రభాకర్
రాయపూర్
12
యోగము
సంయోగము
నుదిటి రాతన లేకుంటే ప్రేమకు వియోగము
శేష శైలజ(శైలి),
విశాఖపట్నం
13
గతం
స్వాగతం
రాబోవు కాలం బాగుండాలనే ప్రతివారి మనోగతం
శ్రీహరి కనగాల
హైదరాబాద్
14
జనవరి
ఫిబ్రవరి
నెలలెన్ని మారినా తెల్లారేనా కష్టాల విభావరి
ఉదండ్రావు రమణబాబు
నరసన్నపేట
15
అంపకం!
పంపకం!!
కాలగర్భంలో సంవత్సరాలు దొర్లిపోయినా చెరిగిపోనిదెప్పుడూ జ్ఞాపకం!!!
నేమాన సుభాష్ చంద్ర బోస్,
విశాఖపట్నం
16
నూతనం
సనాతనం
చివరదని అనిపించు పరిభ్రమణం ఎప్పుడూ నవచేతనం.
వి యస్ శాస్త్రి ఆకెళ్ల
విజయనగరo
17
చిక్కకు
దక్కకు
చెడుదారులు త్రొక్కి కాపాడమని దేవుని మ్రొక్కకు!
జంజం కోదండ రామయ్య
జమ్మిపాళెం
18
అంటుంది
వింటుంది
నీ సమస్యకు పరిష్కారం నీలోనే ఉంటుంది
ఆలేటి పరంజ్యోతి
ఖమ్మం
19
వరము
సంవత్సరము
కొత్త ఏడాది అందరికీ కావాలి శుభకరము
ములగ రాధా కృష్ణ
బొబ్బిలి
20
అనుక్షణం
తక్షణం
సమయానుసారం సమయస్ఫూర్తితో మెలగడం విలక్షణమైన లక్షణం
శ్రీవాణి
తెనాలి
21
విత్తు
పొత్తు
నీతిబోధ లేకుంటే సంఘాన్ని చేయలేరు మరమ్మత్తు
సూర్యదేవర రవికుమార్
గుంటూరు
22
శ్రీకారం
స్వీకారం
మంచి ఆలోచనలే హృదయానికి మంచి అలంకారం
పురం అనూరాధ
ఏలూరు.
23
యంత్రం
మంత్రం
మనం చేస్తే తంత్రం యితరులది కుతంత్రం.
శ్రీమతి కమలా దేవి
మాదాపూర్-హైదరాబాదు.
24
రక్షణ
భక్షణ
కాచుకోవడము కబళించడం జీవులకు పుట్టుకతోనే శిక్షణ!!
పట్నం శేషాద్రి
హైదరాబాద్
25
ఆత్మ
పరమాత్మ
రెండింటి మధ్య సమరసo వ్యవహారమే జీవాత్మ..
డా.పద్మావతి పి
హైదరాబాద్
~
(మళ్ళీ కలుద్దాం)