Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచికలో 25 సప్తపదులు-32

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
మనుషులు
రుషులు
చిన్న ఉపకారమైనా పర్వతమంత భావిస్తారు సత్పురుషులు.

కత్రోజు నర్సింహాచారి,
సికింద్రాబాద్.

2
పటిష్ఠము
బలిష్ఠము
గోడలే కాదు మాటలూ కావాలి విశిష్టము.

పట్నాల ఈశ్వరరావు
విజయనగరం

3
నరుడే
పామరుడే
ప్రపంచంలో అందరికంటే దరిద్రుడు అధిక ఆశపరుడే

అంజనీదేవి శనగల
విశాఖపట్నం

4
నడత,
దృఢత,
శ్రీరామచంద్రుని అనుగ్రహం పొందిన ధన్యజీవి ఉడత!

దినవహి సత్యవతి
గుంటూరు

5
సకారం
శకారం
వర్ణాలు వ్యత్యస్తమైతే శబ్దంలో కలిగేది వికారం!

ఎన్.ఆర్.తపస్వి
చెన్నై

6
నరపరంపర
తామరతంపర
కుంభమేళా సాక్షిగా శుభాలు అందించును గురుపరంపర

డా. గాదిరాజు మధుసూదనరాజు,
అనంతపురము.

7
అభిమానం
దురభిమానం
సత్యభామ మనోభిరాముని ప్రేమించినా కలదు స్వాభిమానం

ఉమాదేవి పోచంపల్లి గోపరాజు
రిచ్మండ్ టెక్సస్ యు ఎస్ ఏ

8
వస్తుంది
ఇస్తుంది
ఋతువేదైనా తన ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తుంది

వురిమళ్ల సునంద
ఖమ్మం

9
వికలాలు
శకలాలు
ప్రేమైనా, బంధుత్వమైనా జీవచ్ఛవాలకు ప్రారబ్ధమనే కలకలాలు.

వి యస్ శాస్త్రి ఆకెళ్ల
విజయనగరం.

10
వదిలేయాలి
చదివేయాలి
గాయాలను దుమ్ములో, సహాయాలను పాలరాతిపై రాయాలి

శ్రీవాణి
తెనాలి

11
వాదన
వేదన
ఘర్షణ, ఆమర్షణ తగ్గుటకై చేయాలి శోధన

కాళీపట్నపు శారద
హైదరాబాదు

12
కేళి
పాళి
జీవితం చిక్కీచిక్కని చక్కరకేళి. పామూనిచ్చెనల వైకుంఠపాళి

డా. రామడుగు వేంకటేశ్వర శర్మ.
హైదరాబాదు.

13
నిలవరు
తలవరు
అందలం ఎక్కాక, స్వప్రయోజనం లేనప్పుడు కలవరు

అభిషేక్
హైదరాబాద్

14
రాద్ధాంతం
వేదాంతం
మనిషి సమాజంలో జీవించు క్రమమే సిద్ధాంతం

కాశీ మూర్తి
హైదరాబాద్

15
భోగి
త్యాగి
శరీరంలోని నిర్మాల్యాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది రాగి

ఎస్.గిరిజశివకుమారి
గుంటూరు

16
పృధ్వి
సాధ్వి
సహనంతో అన్నింటినీ భరిస్తాయి కనుకనే వృద్ధి

వేము విజయ్ కుమార్
మనుబోలు, నెల్లూరు జిల్లా

17
రక్షణ
శిక్షణ
విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలి చక్కని క్రమశిక్షణ!

మొర్రి గోపి
కవిటి

18
న్యాసం
విన్యాసం
రాజకీయనాయకులు ఇస్తారుగా ఎన్నికల ముందు ఉపన్యాసం!

పప్పు సుజాతారావు
వైజాగ్

19
క్రాంతి
విక్రాంతి
నూతన అభ్యుదయ శక్తికి సంకేతం సంక్రాంతి

కోటమహంతి వెంకటరావు
విశాఖపట్నం

20
ప్రాయం
ప్రియం
ఆరాటం పోరాటాల మధ్య జీవితం.. తృణప్రాయం!

జీ యన్ వి సత్యనారాయణ
హైదరాబాద్

21
పడు!
తలపడు!!
మంచిని పెంచి నీకై నువ్వు బలపడు!!!

మన్నవ సుధాకర్
కృష్ణలంక, విజయవాడ

22
అపాయము
ఉపాయము
పిల్లల్ని దండోపాయము లేకుండా సంస్కరిస్తే నిరపాయము

వి నాగమణి
హైదరాబాద్

23
జాతులు
రీతులు
చిచ్చుపెట్టి ఆనందించే వారికి నేర్పాలి నీతులు..

పంతుల లలిత-నీలాంజన
విశాఖపట్నం

24
స్థిరాస్తి
చరాస్తి
భారతీయుల అస్తిత్వానికి ఆధ్యాత్మికతయే శ్రేష్ఠమైన ఆస్తి

నెల్లుట్ల శ్రీనివాసులు
చెన్నై

25
మఠాలు
పీఠాలు
మంత్రతంత్రాలు ఏవైనా -అనుభవం చేప్పేవే పాఠాలు.

మురళి ఎఱ్రాప్రగడ
పలివెల.
~

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version