Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచికలో 25 సప్తపదులు-34

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
ఆర్జితము
శాశ్వతము
అనుక్షణం ఉత్తేజపరిచి ఊపిరులూదే అనుభూతి సoతసము

ఆచార్య వై వి సుబ్రహ్మణ్యం,
హైదరాబాద్

2
అదిలించు
విదిలించు
సమయపాలనతో సోమరితనాన్ని సమూలంగా కూకటివేళ్లతో పెకలించు…!

జవ్వాదిసూర్యారావు,
పర్లాకిమిడి, గజపతి జిల్లా, ఒడిశా,

3
వ్రాతలు
చేతలు
దేశం అభివృద్ధికోసం నిజాయితీగా పనిచేయాలి నేతలు

శైలజ సామినేని
విజయవాడ

4
హాసం
దరహాసం
ఇతరుల బలహీనత పట్ల కూడదు పరిహాసం

పి.బాలాత్రిపుర సుందరి
హైదరాబాద్

5
ప్రభవ
విభవ
అప్పుడూ ఇప్పుడూ అనికాదు ఎప్పుడూ సుఖీభవ!

డబ్బీరు ప్రభాకర్,
రాయపూర్.

6
హాసం
విలాసం
ప్రయత్నం మనది ఫలితం పైవాడి చిద్విలాసం!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

7
జీవజాలము
వృక్షజాలము
మహిని మనజాలాలంటే మెరుగుపడాలి మనిషి భావజాలము!

పట్నాయకుని రామకృష్ణారావు
కంచరపాలెం.విశాఖపట్నం.

8
వేదసారం.
జీవసారం
వృద్ధాప్యం వయసు మాత్రమే కాదు అనుభవసారం

అంజనీదేవి శనగల
విశాఖపట్నం

9
చట్టాలు
పట్టాలు
వ్యవస్థలతో, రాజకీయంతో నాయకుల గుంభనమైన చెట్టాపట్టాలు.

వి యస్ శాస్త్రి ఆకెళ్ల
విజయనగరం.

10
గాత్రం
సూత్రం
గానకచేరిలో గాయకునికి ఉండరాదు ఎప్పుడూ ఆత్రం!

డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచార్య
మహబూబ్ నగర్.

11
మతి
పతి
జీవితకృతికి అలంకృతి శ్రీమతి -ఆమెతోనే పరపతి

డా. రామడుగు వేంకటేశ్వరశర్మ
హైదరాబాదు

12
పెట్టుబడి
దిగుబడి
వ్యాపారం సమర్థవంతంగా నిర్వహిస్తేనే వస్తుంది రాబడి

కపిలవాయి అశోక్ బాబు
నాగర్ కర్నూల్

13
నిర్భాగ్యుడు
దౌర్భాగ్యుడు
ఘోరాపరాధియైనా సంజయ్ రాయ్ మరణశిక్ష తప్పించుకున్న సౌభాగ్యుడు.

శ్రీమతి ఎస్. కమలా దేవి,
మాదాపూర్

14
వివరాలు
జవరాలు
ప్రేమికులు జంటగా వెళుతుంటే తీస్తారు ఆరాలు

పార్లపల్లి నాగేశ్వరమ్మ (టీచర్)
నెల్లూరు

15
అవ్వాయి
చువ్వాయి
ఉడికింపులు ఊరింపులతో పిల్లలకు వచ్చింది తవ్వాయి.

పట్నాల ఈశ్వరరావు
విజయనగరం

16
ఉచితం
సుపరిచితం
ప్రతిఫలం లేకుండా పొందటం మనకు అనుచితం.

టిడికస్తూరి
మెహెదిపట్నం ,హైదరాబాద్

17
విడగొట్టకు
పడగొట్టకు
మంచిని మానవత్వాన్ని మరచి స్వార్థంతో చెడగొట్టకు!

జంజం కోదండ రామయ్య
జమ్మిపాళెం

18
నస
బుస
విషయం నానుతూ ఉంటుంది లేనప్పుడు పస

మాధవి మేళ్ళచెర్వు
గుంటూరు

19
విసురు
కసురు
వేధించటం అలవాటయితే తగలక తప్పదు ఉసురు

డా.పి.వి.రామ కుమార్
హైదరాబాద్

20
తక్కువా
మక్కువా
భరతమాత కన్నా ఏదీ కాదులే ఎక్కువా !

ఎమ్మెస్సార్ భార్గవి ప్రియ
(Pharma-D : 1st year)
విజయవాడ

21
ప్రేరణ
ధారణ
హృదయాంతరాల సమ్మోహనపు రచనలకు కలుగును ఆదరణ

వి. కోమలి
హైదరాబాద్

22
అలుపు
మలుపు
మంచిపని చేసినప్పుడు పొందుతుంది మనసు గెలుపు.

కుసుమంచి నాగమణి
మెంటాడ

23
కాదు
రాదు
ఎంతో ఎదురుచూసినా రావలసింది వచ్చేది పోదు.

దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం

24
వారు
వీరు
కలిసి మెలిసి ఉండక ఎందుకనో తకరారు

శేష శైలజ (శైలి),
విశాఖపట్నం

25
కీర్తి
ఆర్తి
ప్రజల నాలుకలపై నడయాడినపుడే జీవితం సంపూర్తి!

వీరేశ్వర రావు మూల
అమలాపురం
~

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version