[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]
~
1
వృద్ధి
బుద్ధి
నిర్మలమైన ధ్యానంతో అవుతుంది మనసు శుద్ధి
సింగీతం విజయలక్ష్మి
చెన్నై
2
త్యాగి
విరాగి
జీవుల కర్మఫలాలకు సాక్షీభూతుడు, పరమశివుడు పరమయోగి..!!
శ్రీమతి భారతీ కృష్ణ
హైదరాబాద్
3
లగ్నము
భగ్నము
తలపెట్టిన పనిపై మనసును చేయాలి నిమగ్నము
ఉదండ్రావు రమణబాబు
నరసన్నపేట
4
భాగ్యము
బోగ్యము
కపటంతో అంగీకరించక వందసార్లు కాదనడమే యోగ్యము
వి నాగమణి
హైదరాబాద్
5
కంటగింపు
ఏవగింపు
కార్యసిద్ధికై అలుపెరుగక చిత్తశుద్ధితో చేయాలి తెగింపు.
పొన్నాడ వరాహ నరసింహులు, ఆమదాలవలస
6
శుకం
రకం
బ్రతుకు కారాదు కింశుకం, కావాలి స్మారకం
డా. రామడుగు వేంకటేశ్వరశర్మ
హైదరాబాదు.
7
ఆటు
పోటు
శ్రీరంగనీతులతో చాపకింద నీరులా జరిగేదే వెన్నుపోటు
వి. సుబ్బారావు.
వైజాగ్.
8
విధానం
ప్రధానం –
చదువు-సంస్కారంతో పాటు ప్రపంచజ్ఞానం, భక్తిమార్గమే సంవిధానం
నేమాన సుభాష్ చంద్ర బోస్, విశాఖపట్నం
9
జ్ఞానం
విజ్ఞానం
స్టెమ్ రంగంలో మహిళలు సాధించారు పరిజ్ఞానం.
అంజనీదేవి శనగల
విశాఖపట్నం
10
బుద్ధులు
హద్దులు
మారడు మూర్ఖుడు. వృథా. చెప్పినా సుద్దులు!
జంజం కోదండ రామయ్య
జమ్మిపాళెం
11
శకటం,
సంకటం
అదుపులేని వాహనప్రయాణంతో ఊహించని గమ్యమే ప్రాణసంకటం!!
డి వి వి ఎస్ మూర్తి.
హైదరాబాద్.
12
జనులు
మునులు
అడవినే నమ్ముకున్న అలుపెరుగని త్యాగధనులు గిరిజనులు!
జి యన్ వి సత్యనారాయణ
హైదరాబాద్
13
మూల్యం
అమూల్యం
పాఠశాలల్లో ఆటలు శూన్యం. మసకబారుతున్న.. బాల్యం
కాకర్ల చెంచలరావు,
ఒంగోలు.
14
కోరుకో
తేరుకో
శత్రువునైనా ద్వేషించడం మానుకో ప్రేమించడం నేర్చుకో..!!
జి.కె.నారాయణ(లక్ష్మి శ్రీ)
జోగుళాంబ గద్వాల్ జిల్లా
15
అతిమతి
పరపతి
తగని తాహతుకి ఆశపడితే, అప్పులతో అవమతి
విత్తనాల విజయ కుమార్
హైదరాబాద్
16
ఆకర్షణ
వికర్షణ
సౌందర్యం అనుభూతిపరమైన ఒక అసాధారణ సంకర్షణ.
శ్రీమతి ఎస్. కమలా దేవి,
మాదాపూర్-హైదరాబాదు.
17
నావలో
త్రోవలో
నీటిలోన, నేలపైన నిర్భయంగా పయనం స్వామిసేవలో
శాంతమూర్తి
హైదరాబాద్
18
అరణ్యం
శరణ్యం
ప్రకృతిలోన వనరులను కాపాడటం అందరికీ వరేణ్యం..
పంతుల లలిత-నీలాంజన
విశాఖపట్నం
19
వేదాంతం
అంతం
జీవితసారాంశాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం సొంతం
జె.విజయకుమారి
విశాఖపట్నం
20
సఫలం
విఫలం
వేదసారం రవ్వంత గ్రహించినా కొండంత ప్రతిఫలం.
మురళి ఎఱ్రాప్రగడ
పలివెల.
21
భోగం
యోగం
వలపు-ఫలించనప్పుడు అది కావాలి త్యాగం
సరోజారాణి కుందవరపు
పర్లాకమిడి
22
భక్షకులు
తక్షకులు
చట్టాలను నిర్లక్ష్యంగా వేలం వేస్తున్న రక్షకులు!
డా.పద్మావతి పి
హైదరాబాద్
23
నీతులు
గోతులు
అందరూ అనుభవజ్ఞులే – ఆచరణకు ఎత్తరు చేతులు
విన్నకోట ఫణీంద్ర
హైదరాబాద్
24
సుకృతులు
అపశృతులు
సంగమస్నానాలు దొర్లాయి కొన్ని తొక్కిసలాటలో మృతులు
గంగరాజు పద్మజ
హైదరాబాద్
25
మార్గదర్శి
కార్యదర్శి
చైతన్యసమాజాన్ని స్వప్నించి జనతను నడిపించేవాడే క్రాంతదర్శి.
పట్నాల ఈశ్వరరావు
విజయనగరం
~
(మళ్ళీ కలుద్దాం)