Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంగీత సురధార-37

అధ్యాయం 28 – మూడవ భాగం

అన్ని దేశములలో వాడుకలో యున్న రాగములు, తాళములు – కొన్ని దేశాలకు మాత్రమే యున్న రాగాలు, తాళాలు:

నాడు పాశ్చాత్య సంగీతము యొక్క ప్రభావము (influence of Western Music) కొద్దో గొప్పో అన్ని దేశాల సంగీతంపైనా వున్నది.

అమెరికా, యు.కె., ఇతర యూరప్ దేశాల్లో పాశ్చాత్య సంగీతం మాత్రమే ఉన్నది. West Asia ఇంకా – ఇటలీ, మధ్య ప్రాచ్య దేశాలకు వాటి యొక్క ప్రత్యేకమైన సంగీత పద్ధతి వాడుకలో ఉన్నప్పటికీ పాశ్చాత్య సంగీత ప్రభావం ఈ దేశాల్లో కూడా ఉంది.

అలాగే Far East దేశాలైన జపన్, చైనా, హాంగ్‍కాంగ్‍, మలేసియా మొదలైన దూర ప్ర్రాచ్య దేశాలలో ఈ దేశపు సంగీత పద్ధతి ఉన్నప్పటికి పాశ్చాత్య సంగీత ప్రభావం కలదు.

ఈ దేశాల్లో (Far East) మోహన, ఉదయ రవిచంద్రిక, మొదలైన ఔడవ రాగాలు, ఆ దేశపు సంగీత సంప్రదాయాన్ని సూచిస్తాయి. మధ్య ప్రాచ్య దేశాల్లో చారుకేశి, సరసాంగి, చక్రవాకం, సింహేంద్ర మధ్యమం మొదలైన రాగాలు మొదటి నుంచి సంప్రదాయంగా ఉన్నాయి.

పాశ్చాత్య దేశాలలో మన శంకరాభరణ రాగము – major scale అనే పేరుతో వుంది. Minor scale అనే పేరుతో కీరవాణి, గౌరీ మనోహరి, నఠభైరవి రాగాలు ఉన్నాయి.

పాశ్చాత్య సంగీతం కేవలం ఇప్పటి Harmony పద్ధతిలో అభివృద్ధి కాక ముందు, hymns, chants అనే పద్ధతిలో (mode) మూర్ఛన, జాతి అనే రాగ పద్ధతిని అనుసరించి ఆరు విధాలైన modes ఉండేవి. అవి ఇప్పుడు వాడుకలో లేవు.

Dorian – ఖరహరప్రియ – Lydian mode – కళ్యాణి. Mixolydian mode – Phrygian mode – Aeolian – హరికాంభోజి; Locrian – శంకరాభరణం – Ionian – నఠభైరవి. ఈ రాగాలని వాళ్ళు పూర్వం భారతీయ పద్ధతిలో melody system లోనే (homophonic) పాడేవారు.

అన్ని దేశాలలో ఉండే రాగాలు:

శంకరాభారణం (కర్నాటక),  బిలావల్ (హిందుస్థానీ) major scale western music ఇప్పటికీ ఉన్నవి. మోహన రాగం ప్రపంచ దేశాలన్నింటిలోను ఉన్నది.

పాశ్చాత్య పద్ధతిలో త్రిశ్ర, Waltz లో; చతురస్ర Quarter లో ఉన్నాయి. ఇది మనకి కూడా ఉంది. హిందుస్థానీలో దాద్రా – త్రిశ్రం – తీన్‌తాళ్ – ఈ త్రిశ్ర చతురస్రాలకి multiples గా ఉన్నవి. కాగా కర్నాటక, హిందుస్థానీలో 5, 6, 7, 8 విశేషంగా ఉన్నవి. వీటినే  మనం ఖండ, మిశ్ర అనీ; హిందుస్థానీలో ఝంపె, రూపక అని అంటాము.

Comparative Derivation of Scales by Model Shift of Tonic (గ్రహ భేదం)

Greek Ecclesiastic European Arabic India

(Carnatic Music /Tamil /Hindusthani Music

Lydic Lonian Mode From ‘C’ Meia Mode ధీర శంకరాభరణం/Arum Palai/బిలావల్
Phrygian Dorian Mode From ‘D’ Irak Mode ఖరహరప్రియ/kodippalai/ కాపి
Doric Phrygian Mode From ‘E’ Mexman Mode తోడి/Vilari Palai/భైరవి
Hypo-lydic Lydian Mode From ‘F’ Edzel Mode కళ్యాణి/Merchem Palai/యమన్
Hypo-Phrygian Mixolydian Mode From ‘G’ DJorka Mode హరికాంభోజి/Sempalai/ఖమాస్
Hypo-doric Aeolian Mode From ‘A’ L’sa Mode నఠభైరవి/Padumalai Palai/అసావేరి
Mixolydic Locrian Mode From ‘B’ Saika Mode నీలాంబరి/Meharahkkurinchi

(ఇంకా ఉంది)

Exit mobile version