Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘సంగీతారాధ్య’ కొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన

డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన ‘సంగీతారాధ్య’.

శ్రీపతి లలిత గారు రచించిన ఈ నవల సంగీతం ప్రధానాంశంగా సాగుతుంది.

నాదోపాసన చేసిన సరస్వత్యం, శివాంశ సంభూతులైన వివాహిత స్త్రీలకు భర్తల నుండి, సాటి కళాకారుల నుండి ఎదురయ్యే హృదయ విదారకమైన సమస్యలను నవలలో బాగా చిత్రీకరించారు.

సమాజంలో ఎంతో పేరున్న గాయనీమణులకు కూడా ఇటువంటి సమస్యలు ఎదురవడం అందరికీ తెలిసిందే.

ఆద్యంతం రసవత్తరంగా నడిచే ఈ నవల వచ్చే ఆదివారం నుంచి సంచికలో ధారావాహికగా ప్రచురించనున్నాము.

చదవండి.. చదివించండి..

‘సంగీతారాధ్య’.

Exit mobile version