Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సరిగ పదమని-9

‘సరిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

~ ~

రిగెడుతూ తాగే పాలు
ఒలకకుంటే చాలు
చేసే పనికి చూడాలి
వీలూ సాలూ!

మతి తప్పే చేష్టలు
గతి తప్పించే ఘోస్టులు!

~ ~

త్పత్తి గొలుసులో
పని ఒక నలుసు
కానీ – విశ్వం మనుగడకు
అదే ఇరుసు

పనికి విశ్రాంతి
అవనికి అశాంతి.

~ ~

చేతు లారంగ
పనిని పూజించడేని
నోరు నొవ్వంగ
శ్రమ కీర్తి నుడువనేని

బతుకు బండికి
ఇరుసు కుదురుటెట్లు?

~ ~

హ తోనే
ఉత్పత్తి సాగుతుండు
యోచన లేని చోట
లోచన కొరతతేలు

స్వేదానికి ఊహ
తోడైతే సాధన.
Exit mobile version