[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘సాయం సంధ్య’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సాయం సంధ్య
సిందూర మందారమై విరబూసింది
అరుణతేజం
అద్భుత కాంతి పుంజమై విచ్చుకుంది
అణువణువున
సింగారం హృద్యమై శోభిల్లుతుంది
కాలరేఖ
క్రమంగా చీకటి వైపు కదులుతుంది
ప్రకృతి గీసిన వర్ణచిత్రం
అనుభూతిని మిగిల్చి మాయమైంది.
నయనానందకర దృశ్యం
అంతలోనే అదృశ్యమై వర్ణాంధత్వమైంది