Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శూన్యం

శూన్యం
శూన్యం
చేరి
శూన్యమైంది
అనంత
శూన్యమైంది
శూన్య స్థితి
అయింది.
సూక్ష్మ స్థితి
అయింది
***
సూక్ష్మ
అతి సూక్ష్మ
రూపాలు
అణు రూపాలు
అనంత కాలంలో
అనంత శక్తులుగా
అవతరించాయి
సవాలక్ష సూత్రాలు
రూపాంతరం చెందాయి.
***
గ్రహాలు, నక్షత్రాలు
పరిమాణం పొందాయి
మోహినీ రూపాలై
పరిణామం చెందాయి
తమ చుట్టూ
తాము తిరుగుతూ
కాలంతో కలసి
కాపురం చేశాయి.
***
నిర్జీవం నుండి జీవం
లేచి నిలబడింది
మొక్కలు
మహా వృక్షాలు
జలచరాలు
జీవ జాతులు
పరిణామ క్రమంలో అమరాయి.
నాటకం
జగన్నాటకం
సూక్ష్మ శక్తుల
జీవ నాటకం
ముగిశాక
అంతా నిర్జీవం
అనంత శూన్యం.
0 – 0= 0

 

Exit mobile version