[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘శ్రామికుడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నిత్య కృషీవలుడు
నిరంతర శ్రామికుడు
ఈ కూలి జీతగాడు
ఎంతో పవిత్రమైంది
అతని ప్రతి అడుగు
పంచభూతాలనడుగు
వ్యవస్థకు బలమైంది
తన పారిశ్రామిక శక్తి
కాదు సాధారణ వ్యక్తి
అతని శ్రమ విలువైంది
వెలకట్టలేని కొలమానం
పణముగా పెట్టిన ప్రాణం
పనే ప్రపంచమైంది
కార్యశీలుని సూక్తి
కర్మణ్యే రూక భుక్తి
