Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ వినోద్ కుమార్ శుక్ల గారి రెండు చిన్న కవితలు

[ప్రముఖ హిందీ కవి, రచయిత శ్రీ వినోద్ కుమార్ శుక్ల గారు డిసెంబరు 23, 2025 నాడు స్వర్గస్థులైనారు. 2024వ సంవత్సర జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శుక్ల గారిని సంస్మరించుకుంటూ.. ఆయన రాసిన రెండు చిన్న కవితలను అనువదించి అందిస్తున్నారు. డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. जंगल की उजाड़ में — हिन्दी मूल – स्व – विनोद कुमार शुक्ल.]


~

1)
జన సంచారం లేని
పాడుపడిన అడవిలో
దుంపలు తవ్వుతూ
అకలితో తెలివి తప్పిపడిన అడవి పుత్రుడు!
అతడిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలా లేక
వంటయింటిలోకా? అని ఏ డాక్టరు చెప్పగలడు?

2)
ఆదివాసీ అమ్మాయికి ఒంటరిగా
దట్టమైన అడవిలోకి పోతున్నా, భయం వెయ్యదు.
పులులు – సింహాలన్నా భయం లేదు.
కాని.. ఇప్ప పువ్వులేరుకుని
గీదమ్ బజారు వెళ్ళాలంటే మాత్రం
భయమేస్తుంది!!

(ఇది చదువుతున్నప్పుడు మృగయా సినిమా లో సీను గుర్తొచ్చింది.)

~

హిందీ మూలం: శ్రీ వినోద్ కుమార్
తెలుగు అనుసృజన: డా. సుమన్‌లత

Exit mobile version