Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్మిత చంద్రిక

[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘స్మిత చంద్రిక’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నిద్దరం
ఒకరి ఆలోచనల్లో
మరొకరమై గడుపుతుంటే
మనసు ఒక ఆకాశమై
అనురాగమే నీలి మేఘమై
తొలకరి వలపుల జల్లులలో
తడిసే
సిందూర సంధ్యలా ఉంది

నీవు నేను
ఒకరికొకరమై పులకిస్తుంటే
భావావేశం
మధుర కావ్యంగా
అక్షర పరవశంగా
ప్రేమ ప్రబంధమై అల్లుకుంటుంది
తీగ వసతంలా

నీవు నేను
ఒకరికొకరం ఊహలలో లయిస్తుంటే
ప్రణయం
మన్మథ శరమై గుచ్చుకుంటుంది
స్మిత చంద్రికలా

Exit mobile version