Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – ‘శ్రీమతి బంధకవి సరోజినీ దేవి స్మారక శ్రీ ప్లవంగ నామ సంవత్సర ఉగాది కథల పోటీ 2027’ ప్రకటన

సంచిక, శ్రీ బంధకవి రమణ, వారి కుటుంబ సభ్యులు సంయుక్త నిర్వహణలో ‘శ్రీమతి బంధకవి సరోజినీ దేవి స్మారక శ్రీ ప్లవంగ నామ సంవత్సర ఉగాది కథల పోటీ 2027’ని నిర్వహిస్తోంది.

~

శ్రీమతి సరోజినీ దేవి (1937 – 2020; భర్త: కీ. శే . వెంకట రామన్న పంతులు బంధకవి), గృహిణిగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూనే 1974 నుండి 1977 వరకు రచయిత్రిగా ఎన్నో కథలు వ్రాసారు. అవి అప్పటి అన్ని ప్రముఖ వార, మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆవిడ వ్రాసిన మొదటి కథ ‘బుద్ధిమంతుడు’ ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో 15-11-1974 న వెలువడింది. ఆవిడ వ్రాసిన కథలు, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, యువ, ఈనాడు-తెలుగునాడు, చందమామ మొన్నగు పత్రికలలో ప్రచురితమయ్యాయి.

~

శ్రీమతి సరోజినీదేవి స్మారక ఉగాది కథల పోటీలో పాల్గొనవలసిందిగా కథకులకు ఆహ్వానం పలుకుతున్నాము.

మొత్తం బహుమతుల విలువ రూ. 15,000/-

ఏ అంశంపై రాయలన్నది రచయితలే నిర్ణయించుకుంటారు అంటే ఇతివృత్తం రచయితల ఇష్టం. కల్పన ఏదయినా, ఊహ ఏదయినా అర్థవంతంగా, ఆసక్తికరంగా, తార్కికంగా వుండాలి. సందేశాలు, నీతులు అంతర్లీనంగా, ప్రతీకాత్మకంగా వుంటే మంచిది. అంతేగానీ, సందేశాలు, నీతులు, సామాజిక స్పృహల కోసమే కథ రాయాలనుకోవద్దని సూచన.

పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన కథలను ఎంపిక చేసి బహుమతులు అందచేస్తాం.

కథల నిడివిపై పరిమితి లేదు. ఒక్కొక్కరు ఎన్ని కథలనైనా పంపవచ్చు. కానీ ఒక కథకే బహుమతి అందుతుంది.

కథకులకు వయసు పరిమితి లేదు. ఏ వయసులో వారైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు.

కథను టైప్ చేసి పంపితే సంతోషం. టైప్ చేయించి పంపేవారు పిడిఎఫ్‍తో పాటు ఓపెన్ ఫైల్ కూడా పంపాలి.

చేతి రాతతో పంపేవారు కథను చివరి తేదీ వరకూ ఆగకుండా కాస్త ముందుగానే పంపటం వాంఛనీయం!

***

నియమ నిబంధనలు:

పంపాల్సిన విధానం:

మెయిల్ ద్వారా కథలు పంపాల్సిన చిరునామా – kmkp2065@gmail.com (kmkp2065 [at] gmail [dot] com) మెయిల్ సబ్జెక్ట్ లైనులో ‘శ్రీమతి బంధకవి సరోజినీ దేవి స్మారక శ్రీ ప్లవంగ నామ సంవత్సర ఉగాది కథల పోటీ 2027’కి అని వ్రాయాలి.

వాట్సప్ ద్వారా అయితే – 9849617392. ‘శ్రీమతి బంధకవి సరోజినీ దేవి స్మారక శ్రీ ప్లవంగ నామ సంవత్సర ఉగాది కథల పోటీ 2027’ కి అని వ్రాయాలి. వాట్సప్‌లో కథలు పంపినవారు తమ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తప్పక పేర్కొనాలి.

By Post (పోస్ట్ ద్వారా అయితే):
(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా కథ కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).
Sachika Web Magazine
Plot no 32, H.No 8-48
Raghuram Nagar Colony.
Aditya Hospital lane
Dammaiguda, Hyderabad-500083

అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా ‘శ్రీమతి బంధకవి సరోజినీ దేవి స్మారక శ్రీ ప్లవంగ నామ సంవత్సర ఉగాది కథల పోటీ 2027’కి అని వ్రాయాలి.

ఫలితాలు 07 April 2027 నాడు వెలువడతాయి. అనంతరం సంచిక వెబ్ పత్రికలో బహుమతి పొందిన కథలు, సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలూ వరుసగా ప్రచురితమవుతాయి.

Exit mobile version