Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్నేహం

[శ్రీ భళ్ళముడి వెంకట నాగేశ్వర రావు రచించిన ‘స్నేహం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

స్నేహం అంటే
మాటల్లో చెప్పలేని అనుబంధం
తప్పు చేస్తే కోప్పడే ధైర్యం
ఆపదలో చేయందించే ఔదార్యం

స్నేహం అంటే
దేవుడు మనిషికిచ్చిన వరం
కష్టంలో కౌగిలించి, సుఖంలో నవ్వించి,
“నేనున్నాను రా” అనే ధైర్యం

స్నేహం చావదు, ఓడిపోదు,
కాలం మారినా కరిగిపోదు.

Exit mobile version