Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్నేహము

[వాణి వేమవరపు గారు రచించిన ‘స్నేహము’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

మధురము స్నేహం జగతిన,
భాగ్యము స్నేహ పరిమళ మోందగ,
ఎదురవు ప్రతి మలుపు నందున,
తోడై యుండును నిరతముగా.

గడచిన కాలపు గుర్తులు,.
బాల్యపు ఆనందకర పొత్తులు,
చేతులు బట్టి ఊసులు చెబుతూ,
నడిచిన ఆ అద్భుత ఘడియలు.

ఏ దరిన ఎవరు నిలిచినా,
గతియించదు స్నేహము కాలగమనమున,
విలువలు నెరిగిన నేస్తము,
మైత్రి మకరందము నొందుట సత్యము ‌.

మనసును నెరిగిన నేస్తము,
కడవరకు నిలిచిన ఆ స్నేహము,
మరువని బంధము ఇది వాస్తవము,
ఆ దేవుని (అమృతపు) దీవెననుట యథార్థము.

Exit mobile version