Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సొగసుకు అక్కసు

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘సొగసుకు అక్కసు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

మేని సొంపులతో
అమాంతం అంతం చేసేవు
నీ ప్రమేయం లేకుండానే
నాకు ప్రమాదం తెచ్చేవు
నీ మానాన నీవున్నా
నా ప్రాణం పోతోందే
ఏ కాస్తా కదిలినా
వికసించే ఆ అందం
కకావికలు చేస్తోందిగా
నీకు కూడా తెలియని సొగసు
అక్కసుగా నాపై పడుతోంది
ఉక్కిరి బిక్కిరైన నేను
ఎక్కడికీ పోలేక
గుటకలేస్తూ చూస్తున్నా
ఏం చేతకాక చస్తున్నా

Exit mobile version