
ప్రాచీన తెలుగు సాహిత్యంలో పద్యప్రబంధాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ప్రబంధాలలో ఒకటైన ‘సౌదామినీ పరిణయం’ కథా సౌందర్యం, భావగాంభీర్యం, పద్యమాధుర్యంతో పాఠకులను ఆకట్టుకునే కృతి.
సహజ కవిత్వ ప్రతిభతో సాహిత్యలోకాన్ని అలరించిన కవులు ఒద్దిరాజు సోదరులు. పద్యరచనలో భావసౌందర్యాన్ని, భాషా మాధుర్యాన్ని సమన్వయపరిచిన వాగ్విభవశాలులు. సంప్రదాయ ప్రబంధరీతిని అనుసరిస్తూనే భావగాంభీర్యాన్ని పాఠకునికి అందుబాటులోకి తెచ్చే సామర్థ్యం వారి రచనల్లో స్పష్టంగా కనబడుతుంది. అలంకారశోభతో కూడిన పదసౌందర్యం, హృదయాన్ని హత్తుకునే భావప్రవాహం వారి కవిత్వానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అటువంటి ప్రతిభావంతులైనజంట కవులు రచించిన ‘సౌదామినీ పరిణయం’ పద్యప్రబంధం సాహిత్యరసికులకు ఆనందానుభూతిని కలిగించే విలువైన కృతి.
కాలక్రమంలో పద్యభాష కొంత క్లిష్టంగా అనిపించే సందర్భాలు ఉండడంతో, ఈ కృతిని ఆధునిక పాఠకులకు సులభంగా అర్థమయ్యే విధంగా భావానువాద రూపంలో అందిస్తున్నారు శ్రీమతి రంగరాజు పద్మజ.
~
సౌదామినీ పరిణయం ప్రబంధం – భావానువాదం
వచ్చే వారం నుంచే
సంచికలో
చదవండి.. చదివించండి
