
dropcap]ప్ర[/dropcap]ముఖ సాహితీ విమర్శకులు, శ్రీ గుంటూరు లక్ష్మీనరసయ్యకు 2026 సంవత్సరానికి గాను ‘సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం’ ను అందజేయనున్నట్లు ప్రొఫెసర్ శ్రీమతి సి.హెచ్.సుశీలమ్మ ప్రకటించారు.
తన తండ్రి లక్ష్మీనారాయణ పేరిట ప్రతి ఏటా ఈ సాహితీ పురస్కారాన్ని ఆమె అందజేస్తున్నారు. ఈ పురస్కారం 2020 సంవత్సరానికి కడియాల రామ్మోహన్ గారికి, 2021 సంవత్సరానికి ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర రెడ్డి గారికి, 2022 సంవత్సరానికి శ్రీ కె. పి. అశోక్ కుమార్ గారికి, 2023 సంవత్సరానికి డా. పాపినేని శివశంకర్ గారికి, 2024 సంవత్సరానికి శ్రీ జి.ఎస్. చలం గారికి, 2025 సంవత్సరానికి డా. లక్ష్మణ చక్రవర్తికి గారికి ప్రదానం చేశారు.
~
2026 నవంబర్ 26, సాయంత్రం 4.30 గంటలకు, గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగే సభలో, ఈ సాహితీ పురస్కారాన్ని లక్ష్మీనరసయ్యగారికి ప్రదానం చేస్తారు.
~
అధ్యక్షత:
ఆచార్య యస్.వి. కృష్ణారావు, తెలుగు విభాగాధిపతి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము
ముఖ్య అతిథి:
ఖాదర్ మొహియుద్దీన్, కవి, పాత్రికేయులు
కీ॥శే॥సిహెచ్. లక్ష్మీనారాయణ (రిటైర్డ్ ప్రొహిబిషన్ ఆఫీసర్) గారి పరిచయం:
శ్రీ అహ్మద్ షరీఫ్, అసిస్టెంట్ ఎక్సైజ్ కమీషనర్ (రిటైర్డ్), గుంటూరు
పురస్కార ప్రదానం:
శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమలరావు ఐ.పి.ఎస్., రిటైర్డ్ డి.జి.పి. ఎ.పి.
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ, రిటైర్డ్ ప్రిన్సిపాల్
పురస్కార గ్రహీత స్పందన
ముగింపు:
డా॥ ఓరుగంటి వెంకటరమణ,
ప్రముఖ హోమియో వైద్యులు, గుంటూరు
~
సాహిత్యాభిమానులకు ఆహ్వానం.
