[శ్రీ రేడియమ్ రచించిన ‘సుమేధ’ అనే కవితని అందిస్తున్నాము.]
కాలు కడప దాటదు
ఊహ ఊరు దాటదు
బెల్లం పై ఈగలు
ఆల్లంపై వాలవు
తెలుగు రాయరాదు
తెలుగులో మహా కవి
అహం అంబారిపై ఎక్కినంత
అణుకువ ఉండాలి అంకుశమంత
రాయి విసర రాదు
ఈటె విసర బోయె
వేపంత చేదుమాట
సుమేధకు తీపిమాట
ప్రజాస్వామ్య రాత
నీటి మీది రాత
