[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రాణ దాత
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం।
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే॥1॥
హయాననముపాస్మహే స్ఫటికనిర్మలాంగం స్ఫుటే
సితాంబురుహవిష్టరే సముపవిష్టమబ్జాలయం।
ప్రసన్నకమలాలయాకలితమంజులాంకం త్రయీ-
శిరశ్చికురభూషణం కృతనతాఘసంశోషణం॥2॥
తవాక్షియుగళం స్ఫురత్పృథులతారకం సాదరం
నిపాతయ కృపాంబుధే! మయి చ పాపకూపస్థితే।
యదుద్ధరతి బాలిశం నవమివాచరన్ మానవం
బృహస్పతిసమం జగత్ ప్రథితకీర్తిమీడ్యం ప్రభో!॥3॥
(శ్రీ జగ్గు వకుళభూషణకవికృతం శ్రీహయవదనస్తోత్రం నుంచీ)
- ప్రాణదః
॥ప్రాణాన్ దదాతీతి ప్రాణదః॥ – ప్రాణములను ఇచ్చునట్టివాడు.
॥ప్రకర్షేణాణం – సుఖవిరుద్ధదుఃఖం, ద్యతి – ఖణ్డయతీతి వా (ప్ర+అణ+ద)॥ – అధికముగా సుఖవిరుద్ధమైన దుఃఖమును ఖండించువారు.
పైది ద్వైత వ్యాఖ్య ప్రకారం.
ఇక శంకర భాష్యం ప్రకారం చూస్తే..
ప్రాణికోటికి ప్రాణశక్తి నిచ్చి ప్రాణదః అని కొనియాడబడిన వాడు.
తైత్తిరీయోపనిషత్ లో ఇలా ఉన్నది.
॥కోహ్యేవాన్యాత్కః ప్రాణ్యాత్॥ – భగవచ్ఛక్తి లేనిదే సృష్టి ఎట్లు నడుచును? ప్రాణులు ఎలా చలించగలవు?
ఇంకొక రకంగా చూస్తే ప్రాణులను ఛేదించువాడు తానే అయి ప్రాణదః అయ్యాడు. ప్రాణములను ఇచ్చువాడు, ఛేదించువాడు కూడా ఆయనే కనుక ప్రాణములను నడుపుతాడు కూడా ఆయనే అయి ఉండాలి.
Here is a reference to mathematical induction.
The beginning of the statement is correct. The ending turned out to be true. Then the middle should also fall into place.
He who gave life and he who takes it away automatically be the one who runs the lives. Or the motor behind the lives.
Potential energy (by virtue of being) is converted into kinetic energy (by virtue of motion) through the God the Motor.
ఈ విధంగా ఆలోచిస్తే ప్రాణములను ఇచ్చువాడు, ప్రాణములను ఉపసంహరించు వాడు, వాటిని నడిపేవాడు కూడా ఆయనే. అందుకే ఆయన ప్రాణదః.
ఇక విశిష్టాద్వైతం ప్రకారం పరాశర భట్టర్ ఇలా చెప్పారు.
॥ప్రాణం దదాతీతి ప్రాణదః॥ – బలమునిచ్చువాడు (reference to Potential Energy). నిత్యసూరులకు సర్వదా తనను సేవించుట అనే అనుభవం కలిగేందుకు కావలసిన బలమును ఇచ్చినవాడు.
ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ప్రతినిత్యం మనకు ప్రాణములను ఒసగే వాడు కనుక భగవంతుడు/విశ్వశక్తి ప్రాణదః.
మన శరీరం జీవించి ఉండేందుకు పంచ ప్రాణాలను (ప్రాణోపాన వ్యానోదాన సమాన) ఇచ్చి రక్షించేవాడు కనుక ప్రాణప్రదుడు లేదా ప్రాణదాత.
యః ప్రాణితి – ఎవరివల్ల ప్రాణులకు ప్రాణ చైతన్యం కలిగి, కదలిక మరియు తాను జీవిని అన్న స్వస్వరూప ఙ్ఞానము (చైతన్యము) కలుగునో అట్టి అంతర్యామి స్వరూపుడు. మరొక రకంగా చూస్తే ప్రాణికి ప్రాణత్వమును ప్రసాదించువాడు.
॥ప్రాణితి అనేక ప్రాణినః॥ – సమస్త జీవులకు ఉజ్జీవన హేతువుగా ఉండుటచే ప్రాణముగా చెప్పబడువాడు.
ఆ ప్రాణులలో ఊర్థ్వలోకాలలో ఉండే దేవతలు కూడా ఉంటారు. సాక్షాత్ బ్రహ్మ గారితో సహా.
మనం చరాచర జీవులు, వాటిలో ఉండే ప్రాణశక్తి గురించి చాలాసార్లు ఇక్కడ చూశాము. ఈ విషయాల గురించి ఆధునిక సైన్స్ ఏమని చెప్తోంది? ఏవైనా పరిశోధనలు జరిగాయా?
ప్రస్తుతం ఆవర్తన పట్టికలో (Periodic Table) 118 మూలకాలు ఉన్నాయి. 132 దాకా ఉంటాయి అనే సూచన కూడా ఉన్నది. వాటిలో అనేక మూలకాలు ప్రయోగశాలలు సృష్టించబడినవి. లేదా అవి సహజంగా ఉన్నా కూడా వాటి ఉనికి ప్రయోగశాలలో తప్ప వేరొక చోట ఇప్పటి వరకూ కనుగొనలేదు. మరికొన్ని Nuclear Accelerators లో మాత్రమే కనుగొనబడ్డాయి. కాబట్టి, ఎన్ని మూలకాలను సహజంగా కనుగొనవచ్చు అనేది ఇంకా పూర్తిగా ఎవరి అవగాహనకు రాలేదు.
సాధారణ పాఠ్యపుస్తకాలలో ప్రస్తుతం సమాధానం 91 మూలకాలు సహజంగా ఉన్నాయి అని ఉంటుంది. టెక్నీషియం అనే మూలకం తప్ప, మూలకం 92 (అదే యురేనియమ్) వరకు ఉన్న అన్ని మూలకాలను ప్రకృతిలో కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు గతంలో నమ్మేవారు. అయితే, సహజంగా స్వల్ప మొత్తంలో సంభవించే ఇతర మూలకాలు ఉన్నాయని తేలింది. ఇది సహజంగా లభ్యమయ్యే మూలకాల సంఖ్యను 98కి తీసుకువస్తుంది.
“నూతన” సహజంగా సంభవించే మూలకాలు
ఆవర్తన పట్టికలో చోటు సంపాదించిన కొత్త మూలకాలలో టెక్నీషియం కూడా ఒకటి. టెక్నీషియం అనేది స్థిరమైన ఐసోటోపులు లేని మూలకం. ఐసోటోపులు అంటే ఒకే మూలకానికి దాని పరమాణు సంఖ్యను కలిగి ఉండి, పరమాణు ద్రవ్యరాశి మార్పుగా ఉండేది. అంటే న్యూట్రాన్లు ఉండవలసిన సంఖ్య కన్నా అధికంగా ఉంటాయి.
వాణిజ్య, శాస్త్రీయ ఉపయోగాల కోసం మాలిబ్డినం న్యూక్లియస్‌ను న్యూట్రాన్లతో కొట్టించటం ద్వారా (bombarding) చేయడం ద్వారా ఇది కృత్రిమంగా ఉత్పత్తి చేయబడుతుంది. ప్రస్తుతానికి ఇది ప్రకృతిలో ఉనికిలో లేదని విస్తృతంగా నమ్మారు. తరువాత ఇది అవాస్తవంగా తేలింది.
యురేనియం-235 లేదా యురేనియం-238 విచ్ఛిత్తికి గురైనప్పుడు టెక్నీషియం-99 ఉత్పత్తి అవుతుంది. యురేనియం అధికంగా ఉండే పిచ్‌బ్లెండేలో టెక్నీషియం-99 యొక్క స్వల్ప పరిమాణంలో కనుగొనబడింది.
93–98 మూలకాలు (నెప్ట్యూనియమ్, ప్లూటోనియమ్, అమెరీషియమ్, క్యూరియమ్, బెర్కెలియమ్ మరియు కాలిఫోర్నియమ్) మొదట బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీలో కృత్రిమంగా సంశ్లేషణ చేయబడ్డాయి. వేరుచేయబడ్డాయి. అవన్నీ అణు పరీక్ష ప్రయోగాలు మరియు అణు పరిశ్రమ యొక్క ఉపఉత్పత్తుల ఫలితంగా కనుగొనబడ్డాయి. మానవ నిర్మిత రూపాల్లో మాత్రమే ఉన్నాయని చెప్ప్తున్నారు. ఇది కూడా అవాస్తవమని తేలింది. ఈ ఆరు మూలకాలూ యురేనియం అధికంగా ఉండే పిచ్‌బ్లెండే నమూనాలలో చాలా తక్కువ మొత్తంలో కనుగొనబడ్డాయి.
బహుశా ఒక రోజు, 98 కంటే ఎక్కువ మూలకాల సంఖ్యల నమూనాలు గుర్తించబడతాయి.
ప్రకృతిలో కనిపించే మూలకాల జాబితా
ప్రకృతిలో కనిపించే మూలకాలు 1 (హైడ్రోజన్) నుండి 98 (కాలిఫోర్నియం) వరకు పరమాణు సంఖ్యలు కలిగిన మూలకాలు. ఈ మూలకాలలో పది స్వల్ప మొత్తాలలో లభిస్తాయి: టెక్నీషియమ్(నం. 43), ప్రొమీథియమ్ (61), అస్టాటిన్ (85), ఫ్రాన్సియమ్ (87), నెప్ట్యూనియమ్ (93), ప్లూటోనియమ్ (94), అమెరీషియమ్ (95), క్యూరియమ్ (96), బెర్కెలియమ్ (97), మరియు కాలిఫోర్నియా (98).
అరుదైన మూలకాలు రేడియోధార్మిక క్షయం (radioactive decay) మరియు మరింత సాధారణ మూలకాల యొక్క ఇతర అణు ప్రక్రియల ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకు, ఆక్టినియమ్ యొక్క ఆల్ఫా క్షయం (Alpha Decay) ఫలితంగా ఫ్రాన్సియం పిచ్బ్లెండేలో కనుగొనబడింది. నేడు కనుగొనబడిన కొన్ని మూలకాలు ఆదిమ మూలకాల క్షయం ద్వారా ఉత్పత్తి చేయబడి ఉండవచ్చు – విశ్వ చరిత్రలో ముందుగా ఉత్పత్తి చేయబడిన మూలకాలు అతి తక్కువ జీవిత కాలం కలిగి ఉండి తరువాత అదృశ్యం అయి ఉండవచ్చు.
అలా అవి అదృశ్యం అయినా కూడా అవి పూర్తిగా అంతరించి పోవు.
ఉదాహరణకు
2 రెండు అనే అంకెను సగం చేస్తే 1. దాన్ని సగం చేస్తే 0.5, మరల దాన్ని సగం చేస్తే 0.125… ఇలా ఎంత కొనసాగినా అది సున్న కాదు. కాలేదు. మన గణన యంత్రాలకు, మన పరిధికి మించి తగ్గిపోతే అది లేదని కాదు. శూన్యం అయిందని కాదు. మన అవగాహనకు అందనంత సూక్ష్మంగా మారిందని అర్థం చేసుకోవాలి.
మరి దీనికీ, ప్రాణశక్తికీ సంబంధం ఏమిటి?
చూద్దాం!
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య