Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన-13

[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

4వ అధ్యాయం – తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం

4.2. ఝాన్సీరాణి (పద్యకావ్యం) కావ్యకర్త పరిచయం (విశ్వనాథ):

తృతీయ ఆశ్వాసం:

“తవ్పట్లును దాళాలును
నుప్పర మొరసికొను గొంతులొలసిన గానం
బప్పురి నొకనాఁ డుత్సవ
మొప్పెన్‌ బుర మెల్ల నందె యొరిగిన దనఁగన్‌
కిటకిట లాడుచున్‌ జనము కేవల యుత్సవతన్మయత్వమై
కటకటలాడెఁ గాల్కదిపి కాలిడనైనను వలు లేక య
క్కటః యవు డొక్కతెల్లదొర కట్టిన గుఱ్ఱపు బండిపైనఁ ద
గ్గుట యని లేనివేగమున గుఱ్ఱములన్‌ బెనువీఁకఁ దోలుచున్‌.
జన మున్నారని బండిక్రిందఁ బడినన్‌ జావచ్చు నంచున్‌ శిశుల్‌
వనితల్‌ తప్పుకొనంగలే రనుచు నేభావంబు లేకుండఁ ద
గ్గని వేగంబున బండి మీఁది కుఱుకన్‌ గగ్గోలుగానై జనం
బును జెల్లాచెద రైరి వచ్చి శకటంబున్ నిల్పఁగా నేంచకన్‌.
వాఁడు దొర, కోప మేచి తుపాకిపెట్టి
కాల్చి చంపును, జచ్చుట కాక వేఱ
చేయునది లేద, చేసిన సేన సచ్చి
యూరిపైఁ ఐడి మారణహోమ మగును.
అయిన దేమొ యగున యన్నంత సాహసం
బుండఁ బోవ దెవరి ర్వియందు
పేదజనులు తొలఁగి భీతావహంబుగాఁ
దొలంగి మలంగి కలంగి మెలఁగఁబడిరి.
భయ మొకచిత్రమైనయది పైమునుఁ గయ్యాది యొక్కరుండు ని
ర్భయుఁ డరుదెంచి పాపముతోడ నెదిర్చినన్‌ జనుల్‌
భయ మణి మూఁగివచ్చెదరు పాపము నిల్వనులేద యప్పు డా
భయమును సిగ్గునంటి దది పాయదు సంస్కృతి లేని జీవునిన్‌
ఆ యుత్సవమున లక్ష్మీ
బాయియు నున్నయదితెల్ల ఆని దురంతం
బాయమ హృదంతరంబుని
మోయఁగ రానంత బరువు మేసినయట్లై
చని గుఱ్ఱంబులకళ్ళెముల్‌ గొని యదల్పన్‌ గుఱ్ఱముల్‌ ముట్టెలం
దునఁ గంవించుచు నొక్కసారి త్వరయందుం బిట్టు కుంచించుకో
ననువుంజాలక గుబ్చినల్‌ గొనఁగఁ గోపాటోవ మేపార నా
మెను వీక్షించుచు శ్వేతదేహుఁడు కళామృష్టంబుగా వేసినన్.”

ఒకరోజు నగరోత్సవ వేళ ఆంగ్లేయాధికారి తన గుర్రపుబండిని జనం మీదుగా తోలించాడు.

అది చూచి లక్ష్మీబాయి ఆ తెల్ల దొరకు బుద్ధి చెప్పడం జరిగింది. స్వరాజ్యకాంక్ష, ఉదాత్తమైన ఆత్మగౌరవం తమ పూర్వీకుల యెడ సగర్వ గౌరవ భావన చిన్ననాడే ఆమెలో కానవచ్చాయి. ఝాన్సీ ప్రభువు గంగాధరరావు సంబంధం వెదకడానికి వీరూర్‌ వచ్చిన పండితుడు లక్ష్మీబాయిని చూడడం ఆమె ఆంగ్లేయాధికారికి బుద్ది చెప్పడం చూసి ఆమె ధైర్య సాహసాలకు ముగ్ధుడై మణికర్ణిక జాతకం చూసి మహారాణి యోగం ఉన్నదని ముగ్ధుడయ్యాడు. అతడు తిరిగి వెళ్ళి జరిగిన విషయాన్ని రాజుకు చెప్పి అతడ్ని ఒప్పించగా బిరూర్‌కు రాజలాంఛనాలతో సవారి వెళ్ళింది.

1842లో రూన్సీ మహారాజులు గంగాధరరావుతో మను వివాహం జరిగిన తరువాత మను ఝాన్సీ లక్ష్మీబాయిగా మారింది. మహారాణిగా మారిన తరువాత లక్ష్మీబాయి రాజకీయ కార్యకలాపాలలో ప్రమేయం పెట్టుకోలేదు. ఒక సామాన్య గృహిణిగా తన జీవితం గడిపింది. నోములు, వ్రతాలూ చేసుకుంటూ దేవతార్చనలతో తీర్థయాత్రలతో అచ్చమైన ఇల్లాలిలా కాలం గడిపింది. లక్ష్మీబాయి ముద్దుమోమును చూసిన వాళ్లు మరికొద్ది సంవత్సరాల్లో ఒకమహాసామ్రాజ్యాన్ని నిర్భ్వయంగా ఎదుర్కుని అద్భుతంగా పోరాడబోయే మహాశక్తి ఆమెనంటే నమ్మలేరని విశ్వనాథ పేర్కొన్నారు.

నగరంలో ఉత్సవం జరుగుతున్నది. ప్రజలంతా వేడుక చేసుకొంటున్న సమయంలో ఒక ఆంగ్లేయాధికారి జనమున్నారని చూచుకోకుండా వేగంగా గుఱ్ఱబ్బండి మీద వస్తున్నాడు. ప్రజలంతా భీతులై పారిపోతుండగా లక్ష్మీబాయి ఆ గుర్రాల కళ్ళాలు పట్టుకొని ఆపి వాడి దురంతాన్ని ఎదురిస్తుంది. వాడు కోపంతో కశతో ఆమెను తాడించబోగా ఆమె తప్పుకొని –

బాధ యన్నదెల్ల ప్రాణులకును సమా
నంబ యచటఁ దెలువు నలువు లేదని బోధిస్తుంది

ఈ నంఘటన మూడర్థాలతో ముడివడి వున్నది.

  1. రూన్సీ లక్ష్మీబాయి తెల్లవారి దురంతాలను మొదటిసారిగా ఇదే చూడడం. ఆమెలో శౌర్యలక్ష్మి నర్తించటానికి ప్రారంభం ప్రథమ సంఘటన (బుద్ధ జీవితం పంచ ఘట్టాలుగా విభక్తమైనట్లు).
  2. ఈ సంఘటనను గంగాధరరావు మంత్రి చూచి ఆమెను ఝాన్సీ ప్రభువునకు భార్యగా చేస్తాడు. రాబోయే కథకు రాణి శౌర్యలక్ష్మీనర్తనానికితడు – పరోక్ష గురువు. ప్రారంభకుడు.
  3. ఆంగ్లేయుల దుష్ప్రవర్తన కది సూచకమై-ఆంధ్రప్రశస్తిలోని మాధవ వర్మ కథతో వ్యతిరేక సంవిధానకాన్ని సంతరిస్తున్నది.

చతుర్థాశ్వాసము:

“ఉర్వినాథున కయ్యె సుతోదయంబు
ఉర్విప్రజలకు నయ్యె సూర్వోదయంబు
వృక్షశేఖరరవసమర్చిత మనోజ్ఞ
రజనికాత్యయముగ నయ్యె ద్విజకులంబు.
తతమహారాజనీతివేత్తృతయుఁ దనది
యయనిధానము ఖద్ధవిద్యయును దనది
విశ్రమస్థానమును బొందు వీధి యంచుఁ
బరమవ్వాదయంబునను లక్ష్రీబాయి తలంచె.
శిష్టరక్షణ శీలంబు దుష్టశిక్ష
ణాదికబలంబు నిత్యధర్మాభిరతియు
జననముం బొందె నంచును సంతసించె
సాధువగు ద్విజశ్రేష్ఠుండు సచివమౌళి.
సతి గడ్డమందు నొక్కం
చితముగఁ బలుచని మొగంబు చెక్కిలి యె మ్ము
న్నతి కొంచెము కన్ధగ ధగ
క్షితిపతి తా లక్ష్మియందు శిశువుం గాంచెన్.
క్ష్మాకాంతావళి యెల్లఁ గావలయు నిస్సంతాన మీ సర్వధా
త్రీకాంతత్వము తామె పొందవలె సాధింపంగ నీకోర్కె నా
నాకూళ్ళుం దినుచున్న శ్వేతముఖ న తానంబు హృద్వీధులం
దాకంఠంబుగఁ బొందె దుఃఖము నతాస్యంబుల్ కృతక్లాంతులై.
సొరిదిన్ మాటికి మాటికిం గలలు వచ్చున్ రాణికిన్ వానిలో
నరు దొప్పన్ గనిపించు నా యువతియే యాదేవతామూర్తియే
మరియుం దాఁ దనబిడ్డవంక గనుచున్ మ్లానాస్యయై చూచు నం
దిరవై యుండిన స్వామిమోమునఁ బ్రభు డింతింతగా నవ్వఁగా.
ఆ కలలలోన నాశిశు
వాకుంచిత దేహయష్టియై పతి నవహా
సాకారకనుషమాంశుల
నేకై కనిపింపకుండు నిందునగింజై.
సచివపురోహితుతో నిది
వచియింపఁగ నెంచు రాణి పతి సుతుఁ బో
రచిగాఁగ నెత్తి నిడుకొని
కిచకిచ లాడింప మఱచుఁ గేళీరతయై.
కొన్ని కలలు హత్తుకొని మనఃఫలకంబు
నం దెసంగుఁ, గొన్ని యల్ల నల్ల
గాలితరంగలందుఁ దేలిపోవుచునుండు
నిలువరింప వల్పనీర మట్లు
కలల లక్షణంబుకాని యియ్యది వాని
ఫలితమందు సుంత పట్ట దిద్ది
ఫలము ఫలమె వాని నిలుచుట నిలువమి
వాని కవియె రెండులోను గావు.
బిడ్డమీఁది రాణిప్రేమ లోపల సగా
నికి సగంబు వాఁడు నిలుపు తనదు
వంశ మంచుఁ గాదు వాఁడు పరంగి మూఁ
కలను బారఁద్రోలవలయు నంచు.
ఒక విలక్షణమైన లౌకికపుఁ దెల్వి
యలఫరంగిజాతికిఁ గల దందులో నొ
కండు మేధావిశేషసంకలితుఁ డనియె
నెంచి నిజమాడినాఁ డనిపించునట్లు.
నలి వ్యాయామనిరంతగాఢకృతబంధమ్ముల్ సతీదేహవ
ల్లులు పుష్పించవుమం ఫలించ వొక వీలుంబట్టి యట్లైననున్
ఫలమున్ నిల్వ దటంచు శాస్త్రదిషణాపాండిత్యమున్ వోని యా
పలుకుల్ నిక్కమువోలెఁ గన్పఁడె ధరాపాలేంద్రుబాలున్ గనన్.
బాలారిష్టము లెక్కువ
వ్రేలాడెడుఁ దోటకూరవిధమున మఱియున్
బా లానడు తల్లి కడన్
బా లైనను లేవు నలతఁబడియెన్ శిశువున్.
పిల్లవాని కస్వస్థత పెరిగిపోయెఁ
గోటలో నగదంకారకోటి కోటి
కెక్కు జతనంబు లన్నియు లెక్కలోకి
రాకపోయెను వట్టియఱ్ఱాక లగుచు.
శిశువు దక్కలేదు చివరకుఁ బదినాళ్ళ
దౌ ప్రయత్న మెల్ల వ్యర్థ మగుచుఁ
బ్రస్తరంబుమీఁదఁ బడినట్టి వర్షంపు
నీళ్ళు లెంతసేపొ నిలువనట్లు”.

ఈ ఆశ్వాసములో ఝాన్సీరాణికి సుతోదయం ఉర్వి ప్రజలకు సూర్యోదయం అయిన కాళరాజ్యమంతా వేడుకలు ఉత్సవాలు జరిగాయి. ఝాన్సీ రాజు గంగాధరరావు పుత్రోదయం వల్ల సంతోషంతో ప్రజలకు దాన ధర్మాలు చేసారు. అయితే ఆ ఆనందం ఎంతోకాలం నిల్వలేదు. కష్టం వచ్చినపుడే గుణం బయట పడుతుంది. ఎవరికీ రాకూడని కష్టాలు లక్ష్మీబాయికి కట్ట కట్టుకుని వచ్చిపడ్డాయి. పుట్టింది ప్రవాసంలో, నాలుగో ఏట తల్లి చనిపోవడం ఏమీ ఎరుగని వయసులో ఏడో ఏటే పెళ్ళి, పదహారో ఏట పుట్టిన బిడ్డ మూడో నెలకే మృతి ఈ విధంగా ఎవరికి రాని కష్టాలు రూన్సీరాణికి వచ్చాయి. గంగాధరరావుకు ఈ సంఘటన ఊహించని విఘాతమైంది.

మామూలుగా ఐతే ఇందులో అంతగా తల్లడిల్లవలసిన పని లేదు. కన్నకొడుకు లేనప్పుడు దత్త స్వీకారానికి అవకాశంఉంది. ఉత్తర క్రియలు చేయడానికి కర్మాధికారాన్ని ఆస్తిపాస్తులపై వారసత్వ అధికారాన్ని ఔరసపుత్రుడితో సమానంగా దత్తపుత్రుడికీ ధర్మశాస్త్రం అంగీకరించింది. శాస్త్రం వరమిచ్చినా దొరలు వరమిస్తారా అన్నది అసలు ప్రశ్న. ఏ రాజ్యానికి ఎవరు వారసులన్నది అక్కడి రాజులు, ప్రజలు తేల్చుకోవలసిందే తప్ప పరాయి దేశంనుంచి వచ్చి పడ్డ వర్తక ముఠాకు అందులో తలదూర్చవలసింది న్యాయంగా ఏమీ ఉండకూడదు. ఈ దేశపు రాజుల మంచితనాన్ని బలహీనతను, నిస్సహాయతను, పరస్పర స్పర్ధలను తెలివిగా వాడుకుని క్రమక్రమంగా దాదాపుగా దేశాన్ని ఆక్రమించిన తెల్లదొరతనం అక్కడక్కడ మిగిలిపోయిన రాజ్యాలను కూడా ఏదో ఒక నెపంతో నోట కరచడానికి కాచుకు కూచున్న రోజులవి. మీరు, మీ వారసులు, మీ ఉత్తరాధికారులు ఎల్లకాలం రాజ్యాన్ని అనుభవించెదరుగాక, మీమీ అధికారపు హక్కులకు మేము సర్వదా పూచీ పదెదము గాక అని ప్రమాణ పూర్వకంగా రాసుకున్న ఒడంబడికలను చిత్తానుసారం తుంగలో తొక్కి పుత్ర సంతానం లేని ప్రభువులు చేసుకున్న దత్తతలను గుర్తించ నిరాకరించి, నడమంత్రపు ‘లాప్సు’ సిద్ధాంతం ప్రయోగించి అప్పటికే అనేక రాజ్యాలను తెల్లవారు లాగేసుకున్నారు. తమకూ అదే గతి పడుతుందేమోనని గంగాధరరావు బాధ. చిరకాలంగా బ్రిటిష్ వారితో తాను నెరపిన మైత్రిని, కనపరచిన విధేయతను, దృష్టిలో ఉంచుకుని.. ప్రజాపీడన, దుష్పరిపాలన నిందలకు తావు ఇవ్వకుండా రాజ్యంలో తాను తెచ్చుకున్న మంచిపేరును గుర్తించి, తెల్లవారు తనను దయ తలచక పోతారా అని లోలోన అతడికి చిన్న ఆశ.

ఆ బాధతోనే, ఆ ఆశతోనే గంగాధరరావు తొందరపడి, దత్త స్వీకారానికి యోగ్యుడైన కుర్రవాడిని తనకు రక్త సంబంధీకుల్లో వెదకమని మనుషులను పురమాయించాడు. కావలసిన అన్ని అర్హతలు గల ఆనందుడనే ఐదేళ్ల కుర్రవాడిని చివరకి ఎంపిక చేసారు. 1853 నవంబర్‌ 20న ఆ బాలుడిని రాజు మరణశయ్య మీద ఉండే యథావిధిగా దత్తత చేసుకుని దామోదరరావు అని నామకరణం చేశాడు. ఎందుకైనా మంచిదని ఝాన్సీలోని ‘కంపెనీ’ పొలిటికల్‌ ఏజంటు మేజర్‌ ఎల్లిస్‌ను, స్థానిక సైన్యాధికారి కెప్టెన్ మార్టిన్‌ను దత్తత స్వీకారోత్సవానికి ఆహ్వానించాడు. తమకు తెలియదని ఆనక బుకాయించేందుకు ఆస్కారం లేకుండా వారి సమక్షంలోనే ఆ తతంగం జరిగాక మేజర్‌ ఎల్లిస్‌కు ఒక విజ్ఞాపన పత్రాన్ని గంగాధరరావు అక్కదే అందజేశాడు. మొదటి నుంచీ మీ పట్లనా విధేయతను గుర్తించి దయచేసి ఆ బాలుడిని నా వారసుడిగా గుర్తించండి. నా తదనంతరం దత్తుడికి యుక్త వయసు వచ్చేదాకా అతడి పక్షాన నా భార్య లక్ష్మీబాయిని రాజ్యమేలనివ్వండి. వారిద్దరి మీదా అనుగ్రహం చూపండి. ఈ ఉపకారానికి జన్మజన్మలా మీకు రుణపడి ఉంటాను – అని ఆ విన్నపంలో కడు దీనంగా కంపెనీ సర్మారు వారిని ప్రార్థించాడు.

“అయ్యో! దానికేముంది? మీ కోరిక చాలా సమంజసం. నా శాయశక్తులా మీకు సాయం చేస్తాను” అని ఎల్లిస్‌ మనఃపూర్వకంగా హామీ ఇచ్చాడు. ఐనా-ఏమి చేస్తాడో, అతడు చెప్పినా పైవాళ్లు వింటారో లేదోనని బెంగపడుతూనే అపస్మారకంలోకి వెళ్ళిపోయాడు.

(సశేషం)

Exit mobile version