[శ్రీ దేవనబోయిన సుధాకరరావు గారు రచించిన ‘తెలుగులో నూతన అక్షరాలు – వాటి ఆవశ్యకత’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
[మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీ దేవనబోయిన సుధాకరరావు ‘తెలుగు సుధాకరం’ అనే పుస్తకం వెలువరించారు. తెలుగు భాష ఉచ్చారణలో లేని ధ్వనులతో కూడిన పదాలను వ్రాసేందుకు కొన్ని కొత్త అక్షరాలను రూపొందించారు. వారి ప్రయత్నం గురించి సంక్షిప్త వ్యాసమిది – సంపాదకులు.]
వ్యాస సంగ్రహం:
ఉపోద్ఘాతం:
అన్య భాషలోని ముఖ్యంగా ఇంగ్లీష్ భాషలోని కొన్ని పదాల ఉచ్ఛారణను పిల్లలకు ఉచ్చారణ దోషం లేకుండా చెప్పలేక దానిమీద పరిశోధన చేసి ప్రత్యామ్నాయమైనటువంటి అక్షరాలను తెలుగులో వాటి యొక్క ఆవశ్యకతను గుర్తించి వాటిని హల్లుల ద్వారానా లేక అచ్చుల ద్వారానా, ఎక్కడ ఉంచాలి? అనేది పరిశోధించి దాని ఇంప్లిమెంటేషన్ మీద పరిశోధన చేసి తీసుకొచ్చినటువంటి వివరణ ఇది.
విషయం:
ఇప్పటికే తెలుగులో 56 ఉన్నాయి కదా మరి కొత్తగా అక్షరాలు చేర్చవలసిన అవసరం ఏమొచ్చింది అని నన్ను చాలామంది అడిగారు. మనకి 56 అక్షరాలు ఉన్నప్పటికీ కొన్ని శబ్దాలను పలకడానికి కావలసినటువంటి సరైనటువంటి అక్షరాలు లేవు. ఆంగ్ల భాషలో అక్షరాలు 26 ఉన్నప్పటికీ ఫోనెటిక్స్ని బట్టి 44 రకాల శబ్దాలు ఉన్నాయి. కాబట్టి మనకి తెలుగులో ఒక అక్షరం ఒక శబ్దాన్నే ఇస్తుంది. కానీ ఆంగ్లంలో ఒక్క అక్షరం రెండు మూడు నాలుగు శబ్దాలను కూడా ఇవ్వవచ్చు. దానికి ఒక శాస్త్రం ఉంది దాన్ని ఫోనెటిక్స్ అంటాము. ఫోనిటిక్స్ ప్రకారము ఆంగ్ల భాషలో 44 శబ్దాలున్నాయి, అక్షరాలు 26 ఉన్నప్పటికీ కూడా. కానీ మనకు తెలుగులో 56 అక్షరాలకి 56 రకాల శబ్దాలు ఉన్నాయి అలాగే ఒక అక్షరం ఒక శబ్దం మాత్రమే పలుకుతుంది. అలా చూసినప్పుడు ఆంగ్ల భాషలో ఉన్నటువంటి అన్ని రకాల శబ్దాలకు అలాగే ఉచ్చారణను ఇచ్చే అక్షరాలు తెలుగు భాషలో మనకి లేవు.
1. మొదటి నూతన అక్షరం – దాని వివరణ:
వర్ణమాలలో నూతనంగా చేర్చబడిన మొదటి అక్షరం ‘
దీనిని అచ్చులలో చేర్చడం జరిగింది.
దీనిశబ్దం ENGLISH లో BANK లోని ‘A’ సౌండ్ పలికే విధానంలో ఉంటుంది.
ఇది ENGLISH PHONETICS లోని æ సౌండ్‌తో సమానం (లాగా ఉంటుంది).
ఉదాహరణకి చూసినట్లయితే MAN అని రాయాలంటే మ్యాన్/మాన్ అని రాస్తున్నాం. రెండూ తప్పులే కదా. BANK అని రాయాలంటే బ్యాంక్/బాంక్ అని రాస్తున్నాం. BAT అని రాయాల్సి ఉంటే బ్యాట్/బాట్ అని రాస్తున్నాం. HAND అని రాయాల్సి ఉంటే హ్యాండ్/హాండ్ అని రాస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళితే కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క ఉచ్చారణ మనం పిల్లలకి సరిగా నేర్పించలేకపోతున్నాము అని నాకు 15 సంవత్సరాల క్రితం నాకు వచ్చినటువంటి అనుమానం వల్ల దానికి పిల్లలకి సరైనటువంటి వివరణ ఇవ్వడం కోసం ప్రత్యామ్నాయంగా కొన్ని అక్షరాలను పిల్లలకి చెప్పడం జరిగింది. అయితే వాటిని పుస్తకం రూపంలో తీసుకురావడానికి కంప్యూటర్లో ఆక్షరాలను టైప్ చేస్తే పడేలా చేయడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే నేను ఉపాధ్యాయుడిని. సాంకేతిక నిపుణుడిని కాదు కాబట్టి ఇవి నేను తెలిసిన వాళ్ల ద్వారా వాళ్ళని వాళ్ళని వాళ్ళని అడుగుతూ కనుక్కుంటూ నాకు తెలిసిన పరిజ్ఞానంతో చేసుకుంటూ రావడానికి సమయం పట్టింది. ఇంకా దీనిపై పరిశోదన జరుగుతూనే ఉంది అని చెప్పాలి.
రెండవ నూతన అక్షరం – దాని వివరణ:
వర్ణమాలలో నూతనంగా చేర్చబడిన రెండవ అక్షరం ‘
దీని శబ్దం ENGLISH లో FAN లోని ‘F’ సౌండ్ పలికే విధానంలో ఉంటుంది.
మరి రెండవ అక్షరం చూస్తే తెలుగులో [FA] అనే సౌండ్ పలికేటటువంటి అక్షరం లేదు. మహా ప్రాణాక్షరం అయిన (ప, ఫ, బ, భ, మ) రెండవ అక్షరాన్ని మనం తెలుగులో FA కి బదులుగా వాడుతూ అలాగే తప్పుగా రాస్తూ అలాగే పిల్లలకు కూడా తప్పుగా చెబుతూ వస్తున్నామని గ్రహించి దానికి ప్రత్యామ్నాయంగా ‘ప’ అనే అక్షరానికి దగ్గరగా ఉండేలాగా ఒక అక్షరాన్ని తయారు చేయడం జరిగింది. అదే ‘ప’ మనం PAN అని తెలుగులో రాయడానికి ఫ్యాన్(PYAN) అని రాస్తున్నాం. FRIEND అని రాయడానికి ఫ్రెండ్(PPREND) అని రాస్తున్నాం. FAMILY అని రాయడానికి ఫ్యామిలీ (PPYAMILI) అని రాస్తున్నాం. కాబట్టి ఇలాంటి తప్పులుని సరిదిద్దడం కోసం ‘ప’ అనే అక్షరం (FA సౌండ్) తీసుకురావడం జరిగింది.
మూడవ నూతన అక్షరం – దాని వివరణ:
వర్ణమాలలో నూతనంగా మాచే చేర్చబడిన మూడవ అక్షరం ‘
దీనిశబ్దం ENGLISH లో MEASURE లోని ‘S’ సౌండ్ పలికే విధానంలో ఉంటుంది.
ఈ శబ్దాన్నిచ్చే (ప్రొనన్సియేషన్ సౌండ్) అక్షరం కూడా తెలుగులో లేదు. ఇది PLEASURE, MEASURE, TREASURE, VISION, ILLUSION, వంటి పదాలలో ‘ఎస్’ అక్షరం పలికే శబ్దం. ‘’ అనేటటువంటి సౌండ్ లేకపోవడం వల్ల దానికి దగ్గరగా ఉన్నటువంటి సౌండ్ అయినటువంటి ‘జ’ని మనం వాడుకుంటూ వస్తున్నాం. కాబట్టి దానికోసం అని ఈ అక్షరాన్ని తయారు చేయడం జరిగింది.
తెలుగులో మనం ఒక విధంగా పలుకుతూ (ఉచ్చరిస్తూ), మరోవిధంగా (తప్పుగా రాస్తున్న కొన్ని తెలుగు పదాలు గమనించండి.
ఉదాహరణ:
మేము తీసుకొచ్చిన మరో ప్రతిపాదన ఏంటంటే అరసున్నాని (ఁ) కూడా వాడుకులోకి తీసుకురావాలి. దాన్ని ‘అన్’ అనేటటువంటి సౌండ్‌కి బదులుగా ఉపయోగించాలి అని దాన్ని కూడా ‘తెలుగు సుధాకరం’ అనే పుస్తకంలో ఉపయోగించి విద్యార్థి లోకానికి తెలుగును సంపూర్ణంగా సులభంగా నేర్చుకోవడానికి అనుకూలంగా తీసుకురావడం జరిగింది.
ఉదా:
మంచం.
దీనిని మనం పిల్లలకి మ కీ సున్నా పెడితే మం, చ కి సున్నా పెడితే చం అని చెబుతున్నాం.
అప్పుడది ‘MAMCHAM’ అనాలి కదా సార్ అని అడుగుతున్నారు పిల్లలు. మనమేమో కాదు MANCHAM అనాలి అంటాం.
మరో ఉదాహరణ:
గంగ మరియు రంభ అనే పేర్లు పరిశీలిద్దాం. ఆంగ్లంలో GANGA మరియు RAMBHA అని రాస్తాం. తెలుగులో కూడా గంగ లో ‘న్’ నకారం పలుకుతుంది గనుక అరసున్నా (ఁ) ని ఉపయోగించి గఁగ అని, రంభ లో సున్నని పలికి నప్పుడు పెదాలు పూర్తిగా మూస్తున్నాం కాబట్టి పూర్తి సున్నాని ఉపయోగిస్తే ఇంకొంచం స్పష్టంగా ఉంటుందని, అందుకే అరసున్నా (ఁ) ని కూడా ఉపయోగించాలని భావిస్తున్నాను.
దేవనబోయిన సుధాకరరావు,
ఆంగ్ల ఉపాద్యాయులు,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మైనంపాడు, ప్రకాశం జిల్లా.
సెల్ : +91 9494941498.
EMAIL: SRDEVANABOINA@GMAIL.COM
తెలుగు సుధాకరం అనే పుస్తకం రచించారు.

