Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుసుకోవాలి

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘తెలుసుకోవాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము]


కలగనే ముందే
తెలుసుకోవాలి
కలలు అనేవి
అలల వంటివి

బలమైనవి
శక్తివంతమైనవి
కొస ఒడ్డు దాక
చేరుకుంటవి

తేలికపాటువి
తాలు పోలికవి
నడి మధ్యలోనే
జారుకుంటవి

మాట్లాడే ముందే
తెలుసుకోవాలి
మాటలనేవి
తూటాల వంటివి

కఠినమైనవి
జటిలమైనవి
సూదిపోట్లుగా
గ్రుచ్చుకుంటవి

మృదువైనవి
మధురమైనవి
సుతిమెత్తగా
హత్తుకుంటవి

నవ్వే ముందే
తెలుసుకోవాలి
నవ్వులనేవి
పువ్వుల వంటివి

పేలవమైనవి
నిర్జీవమైనవి
నిరాకారముగా
కనిపిస్తుంటవి

గంధమైనవి
అందమైనవి
తావిభరితంగా
ఆకర్షిస్తుంటవి

Exit mobile version