[కిట్టీ వెల్స్ పాడిన ‘దే ఆర్ స్టెప్పింగ్ ఆల్ ఓవర్ మై హార్ట్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- కిట్టీ వెల్స్ – దే ఆర్ స్టెప్పింగ్ ఆల్ ఓవర్ మై హార్ట్ (1971)
- ఆల్బమ్ – దే ఆర్ స్టెప్పింగ్ ఆల్ ఓవర్ మై హార్ట్
- రచన – జానీ స్పెక్కా, షోర్టీ లాంగ్
~
I may look old for my years and these wrinkles on my face
They were put there by my kids I love so dear
They won’t listen to what I say and it’s turning my hair gray
The kids grow older and hurt me more each year
(నేను, ముఖంపై ఉన్నఈ ముడతలతో నా వయసు కన్నా ఎంతో పెద్దగా కనిపించవచ్చు. నేను ఎంతగానో ప్రేమించే నా పిల్లల కారణంగా ఏర్పడ్డ ముడతలు అవి. నేను చెప్పేదేదీ వాళ్లు వినరు. అదే నా జుట్టుని తెల్లబరుస్తోంది. పిల్లలు పెద్దవాళ్ళవుతూ, ప్రతి ఏడాదీ నన్ను ఇంకా ఇంకా గాయపరుస్తున్నారు)
తల్లిని తేలికగా చూస్తూ, ఆమెను తమకు పనులు చేసి పెట్టే వ్యక్తిగా తప్ప మరోలా చూడలేని పిల్లల స్వార్థం నడుమ వయసు కన్నా ముందే ముంచేసిన ముసలితనంతో కనిపిస్తూ, తెల్లబడ్డ జుట్టుతో, ముడతలు పడ్డ ముఖాలతో ఎంత మంది తల్లులు ఒంటరితనంతో నలిగిపోతున్నారో స్త్రీల పట్ల ఆదరణతో చుట్టూ పరికిస్తే అర్థం అవుతుంది. అలాంటి స్త్రీల పక్షాన నిలిచి వారిలోని వేదనను ప్రపంచానికి పరిచయం చేస్తుంది కిట్టీ. తనలో జీవం పోసుకున్న పిల్లలే వాళ్ల జీవితాలలో తల్లికి ఏ మాత్రం స్థానం ఇవ్వకుండా ఎదుగుతుంటే ఆ తల్లి పడే బాధను కిట్టీ తన గాత్రంతో అత్యంత విషాదంగా పలికిస్తుంటే శ్రోతలు మనసులు మూగబోతాయి.
When they were little, they sat on my knee
I gave them all my love from the start
Now they’re too big to sit on my knee
They’re stepping all over my heart
ఎంతో విషాదాన్ని పలికించే చరణం ఇది. పసితనపు రోజుల్లోని అమాయకత్వం నుండి బయటపడి, సమాజంలోకి క్రమంగా ప్రవేశిస్తున్నపిల్లలు తల్లిని ఎంత నిర్లక్ష్యం చేస్తారో, ఆమె మనసును ఎన్ని ముక్కలు చేస్తారో ఆ దశను అనుభవిస్తున్న తల్లులకు తెలుసు. కాని అది వాళ్ళు బైటకు చెప్పలేరు. అలా వారు బైటపడడం, తల్లితనం కాదని సమాజం వారిని బంధించి ఉంచింది. పిల్లల హింసను పెదవి విప్పకుండా భరించడమే తల్లి భాద్యత అన్నది సమాజ వైఖరి. తమ జీవితాలలో అన్నిటికి వదులుకుని పిల్లల కోసం జీవించడం వారి భాద్యత అయినప్పుడు, ఆ భాధ్యతకు సరైన గౌరవం ఎందుకు ఆశించకూడదు అని అడిగే అధికారం తల్లులకు లేదు. మన దేశంలో ఇక్కడకు వచ్చేసరికి కర్మ సిద్దాంతం, అదృష్టాలు చర్చకు వస్తాయి, పాశ్చాత్య దేశాలలో పిల్లల సైకాలజీ చర్చకు వస్తుంది తప్ప ఆ తల్లి ఎదుర్కునే నిరాశకు జవాబు ఉండదు.
They’re my own flesh and blood so no matter what they do
I will lovе them in a mother’s special way
I pray to God еach day and night that my kids turn out right
These are heartaches every mother has to pay
(వాళ్లు నా రక్తమాంసాలు పంచుకున్న బిడ్డలు. అందుకే వాళ్ళేం చేసినా నేను తల్లిగా విశేషంగా వాళ్లను ప్రేమిస్తూనే ఉంటాను. ప్రతి రాత్రి నా పిల్లలు మంచివాళ్ళుగా ఎదగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూనే ఉంటాను. ఈ మనోవేదనలను ప్రతి తల్లి విధిగా భరించవలసిందే)
ఎంత గాయాలపాలు చేసినా వాళ్ళు ఆ తల్లి బిడ్డలే. ఆమె రక్తమాంసాలను పంచుకుని పుట్టినవాళ్ళే. అందుకే వాళ్ళేం చేసినా, ఎంత వేదన పాలు చేసినా, ఎంత గాయాలపాలు చేసినా ఆమె వాళ్లను ప్రేమిస్తూనే ఉంటుంది. వాళ్లు మంచివారిగా ఎదగాలని ప్రతి రోజూ ఆ దేవున్ని ప్రార్థిస్తూనే ఉంటుంది. ఇలా తప్ప మరోలా జీవించలేని అశక్తతను అనుభవిస్తూ, తన జీవితం అంతా వాళ్ళే ఆక్రమించుకుంటుంటే, తన హృదయాన్నిగాయాల పాలు చేస్తుంటే భరిస్తూ వారి క్షేమం కోసం కాంక్షిస్తూనే ఉంటుంది.
When they were little, they sat on my knee
I gave them all my love from the start
Now they’re too big to sit on my knee
They’re stepping all over my heart
Oh yes, they’re stepping all over my heart
(వాళ్ళు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడూ నా కాలిపై కూర్చునే వాళ్లు. ఆ మొదటి క్షణంనుండి నేను వాళ్ళకు నా ప్రేమనంతా పంచాను. ఇప్పుడు నా కాలిపై కూర్చోలేనంత పెద్దవారయిపోయారు. అందుకే కాబోలు వాళ్లు నా హృదయాన్ని తొక్కేస్తున్నారు. అవును అందుకే నా హృదయాన్ని నలిపేస్తున్నారు)
ఇందులో బాధా ఉంది, జీవితంతో రాజీ పడిపోవడమూ ఉంది. ప్రేమ పేరుతో నిరంకుశంగా జరిగిపోయే దోపిడీ కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో గమనిస్తే అతి పెద్ద దోపిడీలు ప్రేమ మాటున సాగుతాయి. ముఖ్యంగా మాతృమూర్తుల విషయంలో. ఆమె చూపవలసిన ప్రేమ బాధ్యత, పిల్లలు చూపే స్వార్థం వారి తెలియనితనం. ఇలా భావించకపోతే మాతృమూర్తుల జీవనం సాగదు మరి. అలాంటి కోట్లాది తల్లుల వేదనను వినిపించే ఈ పాట కిట్టీ వెల్స్ ఎన్నుకున్న విభిన్న సామాజిక విషయాలు, స్త్రీల వాదాన్ని వినిపించడానికి పాటల ద్వారా ఒక పదునైన గొంతుకగా ఆమె చరిత్రలో నిలిచిన వైనాన్ని సూచిస్తుంది. తన సంతానం ఎంతగా హింసించినా వారిపట్ల అచంచలమైన ప్రేమను ప్రదర్శిస్తూ, వారి కోసం సర్వం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండే మాతృత్వంలోని ఔన్నత్యమూ చూపిస్తుందీ పాట. తన సంతానం ఎంతగా హింసించినా వారి మంచికోరే అమ్మ భావనలోని ఉత్తమత్వం ప్రదర్శిస్తూ, ఫెమినిజం అంటే, మాతృత్వాన్ని శిక్షగా, హింసగా భావించటం కాదని పాటలోని ఈ పంక్తులు నిరూపిస్తాయి.
I will lovе them in a mother’s special way
I pray to God еach day and night that my kids turn out right
(ఈ పాటని యూట్యూబ్లో చూడవచ్చు/వినవచ్చు:
https://youtu.be/Qjdez3vOtos?si=06NNfceAcK7fD2Mw)

