Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తొక్కిసలాట

[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘తొక్కిసలాట’ అనే కవితని అందిస్తున్నాము.]

తొక్కిసలాట
సినిమా టికెట్టుకు
హీరో దర్శనానికి

క్రికెట్ మ్యాచ్‌కు
ఆటగాళ్ళ దర్శనానికి

పుణ్య స్నానానికి
దైవ దర్శనానికి
బాబాల ప్రవచనాలకు

తొక్కిసలాట
తొక్కిసలాట
తొక్కిసలాట

పోతున్నాయి ప్రాణాలు
అవుతున్నారు
అంగవికలురు

చేతులు దులుపుకుంటున్నారు
పాలకులు ప్రకటించి
తృణమో పణమో
క్షతగాత్రులకు
మృతుల కుటుంబాలకు
అలవాటు ప్రకారం

వేలం వెర్రి
అందామా
ప్రజల సందడి

ఏమందామీ
జనాలను
బలై పోతున్న
బడుగులను

Exit mobile version