Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తొలి కిరణం

[వాణి వేమవరపు గారు రచించిన ‘తొలి కిరణం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

దినకరుడు తన విధిన నిలిచి,
తూర్పున ఉదయపు రేఖలు నిలిపే,
భూమిన తాకిన తొలి కిరణం పరచిన
మంచు దుప్పటిని మెత్తగా తొలగించే,
సుతిమెత్తని వెచ్చని భానుడి స్పర్శ,
విచ్చుకుంటున్న సుమాలపై పన్నీరు జల్లించె,
తొలి జామున కూసిన కోడి
కునికిన కనులకు మెలుకువ తెలిపే,
పరువపు విరిబోణిలా ప్రకృతి
తన సోయగం భూమంతా పరిచే.

Exit mobile version