Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తొలి ప్రేమ

[శ్రీ కయ్యూరు బాలసుబ్రమణ్యం రచించిన ‘తొలి ప్రేమ’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

నా చూపు
సూర్య కిరణాలై
సోకగానే
తన వదనం
కలువ రేకులై
విచ్చుకుంది

నా పలుకు
తుమ్మెదలా
చుట్టగానే
తన మనసు
గులాబి పువ్వై
వికసించింది

నా స్పర్శ
వెచ్చని గాలిలా
తగలగానే
తన తనువు
అత్తిపత్తి మొక్కలా
ముడుచుకుంది

Exit mobile version