Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ట్రాన్స్‌ఫార్మేషన్

[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘ట్రాన్స్‌ఫార్మేషన్’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

రీరంలో ఏ భాగం పాడైపోయినా
చాలా ఈజీగా రీప్లేస్ అయిపోతోంది.

కన్ను ఇంప్లాంట్, పన్ను ఇంప్లాంట్
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్
ముంజేతి కీలుకీ సర్జరీ
మోకాలి గూటికీ సర్జరీ

ఆర్గనాయిడ్స్ కూడా అందుబాటులోకి వస్తే
మనిషికి నూరేళ్ళ జీవితం గ్యారెంటీ కాకపోయినా
నిండు జీవితకాలం అన్ని అవయవాలకీ గ్యారెంటీ

కానీ హ్యుమనాయిడ్ రోబోస్ సొసైటీ లాగే
రోబొటైజ్‌డ్ హ్యుమన్ సొసైటీ రూపుదాలుస్తుందేమో!

Exit mobile version