Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత ‘మంజరి’కి నివాళి

ప్రముఖ రచయిత, ‘మంజరి’ కలం పేరుతో సాహితీ లోకానికి పరిచితులైన శ్రీ గంధం నాగేశ్వరరావు కొద్ది సేపటి క్రితం విజయనగరంలో తుదిశ్వాస విడిచారు.

పోలీస్ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. విజయనగరంలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. 1 జూలై 1959న ఏలూరులో జన్మించారు.

‘ఒక్క తూటా చాలు’, ‘టార్గెట్ టు’, ‘మృత్యుకెరటం’, ‘పథకం’, ‘అన్వేషణ’ మొదలైన నవలలు వ్రాశారు. ‘నివాళి’, ‘సంకెళ్ళు’ వారి కథాసంకలనాలు.

క్రైమ్ రచయితగా పేరెన్నికగన్న మంజరి మంచి వక్త. స్నేహశీలి. వీరి సతీమణి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి ఇటీవలె పదవీ విరమణ చేశారు. కుమారుడు విశాఖపట్టణంలో బ్యాంక్ ఆఫీసర్‍గా పనిచేస్తున్నారు. కుమార్తె అమెరికాలో ఉంటున్నారు.

గత మూడేళ్ళ నుండి మూత్రపిండాల వ్యాధితో అనారోగ్యంగా ఉన్నారు. వీరి మృతి పట్ల సాహితీలోకం దిగ్భ్రాంతికి గురయింది. సహజ సంస్థ అధక్షులు ఎన్.కె. బాబు, సంచిక వెబ్ పత్రిక, ఇతర సాహితీ మిత్రులు మంజరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభుతి వ్యక్తపరిచారు. నివాళి అర్పించారు.

Exit mobile version