[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘త్రివేణి’ అనే కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
1)
మౌనాన్ని నిశ్శబ్దాన్ని కోరుకునే వాణ్ని
ఎప్పటికీ మౌనం కాని నిశ్శబ్దం కాని జ్ఞాపకంతో
మాట్లాడుతూనే ఉంటాను.
2)
బతుకులో ఏదో ఒక దారిని ఎంచుకున్నాక
మిగిలిన దారులు జీవితాంతం మూతబడవు
మనసులో నడుస్తూనే ఉంటాయి.
3)
అధికారం శాశ్వతమని నమ్మినవాళ్ల గర్వంలో
కన్నీటి చుక్కయినా లేకపోవచ్చు
చివరికి ఎడారిలో శిథిలమవుతుంది.
4)
ఎంతగా అణచివేత అమలుచేస్తూ
నన్నునేలలో పాతిపెట్టినా
నా ఆత్మ మాత్రం ప్రతిసారీ పైకి లేస్తూనే ఉంటుంది.
5)
ఖచ్చితంగా ఏదో ఒక రోజు
పూలు వెన్నెల కూడా
మన లోపలి విషాదాన్ని నర్తింపజేస్తాయి.
6)
మరణం శాంతంగా ప్రశాంతంగా
బాధా రహితంగా పిలిచినా
మనిషి మాత్రం పోరాడాల్సిందే.
7)
ప్రేమ మరణాన్ని జయించలేకపోవచ్చు
కానీ మరణాన్నీ
ప్రేమించగలదు.
8)
ఎప్పటికీ ప్రేమ ఒక లెక్క కాదు,
అదెప్పుడూ లెక్కించలేనంత
విస్తారమయింది.
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
