[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘త్రోవ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తెంపు లేనిది త్రోవ
ముగింపు లేనిది త్రోవ
అంతం కానిది త్రోవ
అనంతమైనది త్రోవ
త్రోవ అనువుగా ఉంటేనే
నడక సులువుగా ఉంటుంది
నిజమే.. ఏ దారి మనల్ని
కైమోడ్చి పూదోసిలితో ఆహ్వానించదు
దారి పొడవున
ప్రయాణం చేస్తుంటే
కొంత సంఘర్షణ మొదలవుతుంది
వింత సంఘటనలు చూస్తే దిగులవుతుంది
వాటిని అధిగమించవసిందే
బ్రతుకు బండి సాగిపోవలసిందే
జీవితం ఓ సుదీర్ఘమైన గమనం తప్ప
సుస్థిరమైన గమ్యం మాత్రం కాదు