Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉగాది పండగ

[19 మార్చ్ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా వాణి వేమవరపు గారు రచించిన ‘ఉగాది పండుగ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

శ్రీ పరాభవ సంవత్సరాది అడుగుడే కాలగమనముగ,
చైత్రమాసమున తొలి పర్వదినముగా,
అన్నిట విజయం నొందెదరు అపారముగా,
ఆ పరాత్పరి, పరమాత్ములు కూడి దీవెనలిడగా.

విరిసెను కుసుమాలు కనుల చందముగా,
మెరియు మేఘములు, కురియు విరిజల్లులుగా,
పచ్చని చెట్లతో పుడమి మురిసెనుగా,
పరవశాన నిలిచే ఆ మాత ప్రకృతిగ.

షడ్రుచుల మేళవింపు పచ్చడితో,
జీవితాన భిన్న రుచుల కలయికతో,
ఎదురీతగ నడిచిన బ్రతుకున,
తీపిని నందించు ఉగాది పండగ.

Exit mobile version