Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉగాది వచ్చేసింది

[19 మార్చ్ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా కానాల సుమంగళి గారు రచించిన ‘ఉగాది వచ్చేసింది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

గాది వచ్చేసింది పలు వన్నెలతో
స్వాగతిద్దాం నిండు మనసుతో
మరచిపోదాం కలిగిన కష్టనష్టాలను
గుర్తు చేసుకుందాం పొందిన శుభాలను

షడ్రుచుల సారమే ఈ జీవితం
అనుభవిద్దాం మనం ఈ ఆనందం
కలకాలం మన సంస్కృతిని గౌరవిద్దాం
నిలుపుకుందాం మన సాంప్రదాయం

ప్రపంచ శాంతికై ప్రార్థన చేద్దాం
ప్రతి ఒక్కరం మనసారా కోరుకుందాం
ప్రజల కన్నా మిన్న కాదు ఆధిపత్యం
శాంతి సౌభ్రాతృత్వంతో ప్రవర్తిద్దాం

ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందిద్దాం
క్రొంగొత్త ఆశలతో సాగుదాం
కోయిల పాటతో గొంతు కలుపుదాం
పరాభవ వత్సరాన్ని స్వాగతిద్దాం.

Exit mobile version