Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉపమ

[శ్రీ జి.ఆర్.భాస్కర బాబు రచించిన ‘ఉపమ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కిటికీ ఊచలకు అల్లుకున్న
మల్లె తీగకు పూచిన పూవొకటి
ధవళ కాంతితో మి‌సమిసలాడుతూ
సుగంధాన్ని విరజిమ్ముతూ ఉంది.
కాని దానికి తెలియదు..
ఇంకొద్ది కాలం గడిస్తే
రంగు వెలిసి పోతుందని..
వాసనలన్నీ ఆవిరైపోతాయని..
తొడిమ నుండి జారి నేలను చేరుతానని..
అచ్చం మనిషి పుట్టుక నుంచి చావు వరకు లానే!!!!

Exit mobile version