[జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా, శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘వైద్యులు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తల్లిదండ్రులు ఇచ్చేది జన్మ
వైద్యులు ఇచ్చేది పునర్జన్మ
రాత్రింబవళ్ళు చేసే వైద్యం
అందించే సేవలన్ని వైవిధ్యం
ఈ దేహమే రోగాల పుట్ట
నివృత్తి చేయడంలో దిట్ట
కాదు మనలాంటి వ్యక్తులు
మానవాతీత మహాశక్తులు
ఈ ప్రాణి కోటికి ఆధారం
ప్రపంచానికి జీవనాధారం
ఆరోగ్యానికి అనునిత్యం
ఆ స్పర్శలోనే ఒక చైతన్యం
స్పందించే శరీర సూత్రం
అవలోకించే అంతర్నేత్రం
ఇలలో వెలసిన వైద్యులు
అన్నిట అనితర సాధ్యులు
జాతీయ వైద్యుల దినోత్సవం
కారాదు ఒక్క రోజు ఉత్సాహం
వైద్యో నారాయణో హరిః
పూజించు వైద్యులను మరి
